నేడే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు.. చెక్ చేసుకోండిలా.!

నేడు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు కూకట్‌పల్లి జేఎన్టీయూలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను రిలీజ్ చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ వెల్లడించారు.

నేడే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు.. చెక్ చేసుకోండిలా.!
Follow us

|

Updated on: Oct 06, 2020 | 8:09 AM

TS Eamcet Results: నేడు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు కూకట్‌పల్లి జేఎన్టీయూలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను రిలీజ్ చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ వెల్లడించారు. అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.in ‌లో చూసుకోవచ్చని ఆయన తెలిపారు. ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి రిజల్ట్స్ పొందవచ్చునన్నారు.

ఇదిలా ఉంటే కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా ఈ ఏడాది ఎంసెట్ ఆలస్యమైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో నాలుగు రోజుల పాటు రెండు సెషన్లలో అధికారులు ఎంసెట్ పరీక్షను నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 102 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. సుమారు 1.19 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరైన సంగతి తెలిసిందే.

కాగా, ఈ నెల 9 నుంచి ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 9వ తేదీ నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్ల నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ నెల 12 నుంచి 18 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలించనున్నారు. ఈ నెల 12 నుంచి 20 వరకు ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లను విద్యార్థులు ఎంచుకోవల్సి ఉంటుంది. ఈ 22న మొదటి విడత ఇంజినీరింగ్‌ సీట్లను కేటాయించనున్నారు. 29 నుంచి ఎంసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరుగనుంది. 30న తుది విడత ధ్రువపత్రాల పరిశీలిస్తారు. అక్టోబర్ 30, 31 తేదీల్లో తుది విడుత ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. నవంబర్‌ 2న ఇంజినీరింగ్‌ తుది విడుత సీట్ల కేటాయిస్తామని కన్వీనర్ వివరించారు. నవంబర్ 4న స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నారు.

Also Read:

ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. చర్చించే కీలకాంశాలు ఇవే..

క్రెడిట్ కార్డు సైజులో ‘ఆధార్’.. అప్లై చేసుకోండిలా.!

వేగంగా భోజనం చేయడం వల్ల బరువు పెరుగుతారట.