క్రెడిట్ కార్డు సైజులో ‘ఆధార్’.. అప్లై చేసుకోండిలా.!

అన్నింటికీ అవసరమైన ఆధార్ కార్డు సరికొత్త రూపును సంతరించుకుంది. మునపటి కంటే మరింత ఆకర్షణీయంగా డెబిట్/క్రెడిట్ కార్డు పరిమాణంలోకి మారిపోయింది.

క్రెడిట్ కార్డు సైజులో 'ఆధార్'.. అప్లై చేసుకోండిలా.!
Follow us

|

Updated on: Oct 04, 2020 | 7:52 PM

Steps To Get PVC Aadhar Card: ఉరుకులపరుగుల జీవితంలో అన్నింటికీ అవసరమైన ఆధార్ కార్డు సరికొత్త రూపును సంతరించుకుంది. మునపటి కంటే మరింత ఆకర్షణీయంగా డెబిట్/క్రెడిట్ కార్డు పరిమాణంలోకి మారిపోయింది. పాలీ వినైల్ క్లోరైడ్‌తో రూపొందే ఈ కార్డు ధర రూ. 50గా నిర్ణయించారు. దీన్ని కావాలనుకున్న వారు ఆధార్ ఆఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి పూర్తి వివరాలు నమోదు చేయాలి. ఆ కార్డు పది రోజుల్లో మీరు పొందొచ్చు. అసలు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

  • పీవీసీ ఆధార్ కార్డు అప్లయ్ చేసేందుకు https://uidai.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
  • గెట్ ఆధార్ అనే చోట order-pvcreprint అనే ఆప్షన్ క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలి.
  • క్యాప్చా కోడ్, ఆధార్‌తో లింకైన మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి.. ఆ తర్వాత వచ్చిన ఓటీపీని కూడా నమోదు చేయాలి.
  • పేమెంట్ పేజీలో మనీ(రూ.50) పే చేయండి. ఆ తర్వాత మీకు వచ్చే ఎస్‌ఆర్ఎన్ నెంబర్ సేవ్ చేసుకోండి. 10 రోజుల్లో కార్డు ఇంటికి వచ్చేస్తుంది.