ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేయించి.. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం రోజా మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆమె అన్నారు. సీఎం జగన్ సుపరిపాలనను ఓర్వలేక చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. యరపతినేని, కోడెల వంటి కీచకుల నుంచి విముక్తి పొందామని పల్నాడు ప్రజలు ఆనందంగా వున్నారని ఆమె చెప్పారు.