16 నెలల్లో రూ.70 వేల కోట్ల ఖర్చు: ఏపీ ప్రభుత్వ విప్ గంగుల

అభివృద్ధిపై కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై టీడీపీ బురదజల్లుతోందని ఏపీ ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈరోజు ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ 16 నెలల్లో రూ.70వేల కోట్లు సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఖర్చుపెట్టిందని తెలిపారు. గత ప్రభుత్వం కూడా ఇవ్వని ఇన్ పుట్ సబ్సీడీని కూడా మాప్రభుత్వం ఇచ్చిందనీ, ఇకపై ప్రతి సంవత్సరం ఇన్ పుట్ సబ్సీడీ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారని […]

16 నెలల్లో రూ.70 వేల కోట్ల ఖర్చు:  ఏపీ ప్రభుత్వ విప్ గంగుల
Follow us

|

Updated on: Oct 29, 2020 | 10:25 AM

అభివృద్ధిపై కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై టీడీపీ బురదజల్లుతోందని ఏపీ ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈరోజు ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ 16 నెలల్లో రూ.70వేల కోట్లు సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఖర్చుపెట్టిందని తెలిపారు. గత ప్రభుత్వం కూడా ఇవ్వని ఇన్ పుట్ సబ్సీడీని కూడా మాప్రభుత్వం ఇచ్చిందనీ, ఇకపై ప్రతి సంవత్సరం ఇన్ పుట్ సబ్సీడీ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమని గర్వంగా చెబుతున్నానని గంగుల తెలియజేశారు.