AP Weather Alert: ఏపీకి వాతావరణ సూచన.. మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు..

|

Jan 12, 2022 | 1:07 PM

AP Weather Report: నైరుతిబంగాళాఖాతం.. దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్లు ఎత్తు వరకు వ్యాపించిఉంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్..

AP Weather Alert: ఏపీకి వాతావరణ సూచన..  మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు..
Ap Weather Alert
Follow us on

AP Weather Report: నైరుతిబంగాళాఖాతం.. దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్లు ఎత్తు వరకు వ్యాపించిఉంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో(Andhrapradesh) పడనుందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనను అధికారులు ప్రకటించారు.

ఉత్తర కోస్తా ఆంధ్ర: ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ,ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ,ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి ఉరుములు లేదా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రాయలసీమ: ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది

 

Also Read:

: యువతలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రజాస్వామ్యంపై స్పృహ ఉండాలిః ప్రధాని మోడీ

 ప్రపంచంలోని అత్యుత్తమ డైట్‌ ఇదే.. ‘మెడిటరేనియన్‌’ పాటిస్తే యవ్వనంగా ఉండొచ్చు..