ఏపీ, తెలంగాణ మధ్య మళ్లీ జల జగడం రాజుకుంది. తెలంగాణపై మరోసారి KRMBకి కంప్లైంట్ చేసింది ఆంధ్రప్రదేశ్. నాగార్జునసాగర్‌కు నీటి అవసరాలు లేకపోయినప్పటికీ, శ్రీశైలంలో పవర్ జనరేషన్ చేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తోందని ఫిర్యాదు చేసింది. ఒకవైపు, శ్రీశైలానికి ఇన్‌ఫ్లో తగ్గిపోవడం, మరోవైపు విద్యుదుత్పత్తి చేస్తుండటంతో జలాశయంలో నీటిమట్టం శరవేగంగా పడిపోతోంది. అయితే, KRMBకి ఏపీ కంప్లైంట్‌చేసి రెండ్రోజులవుతున్నా, ఇప్పటివరకు తెలంగాణ గవర్నమెంట్ రియాక్ట్ కాకపోవడమే ఆసక్తికరంగా మారింది. ఒకవైపు శ్రీశైలంలో ఏపీ పవర్ జనరేషన్ చేస్తూనే, మరోవైపు తెలంగాణపై KRMBకి కంప్లైంట్ చేయడంపై సీరియస్‌గా రియాక్టయ్యే అవకాశం కనిపిస్తోంది.
అయితే, ఏపీ వాదన మరోలా ఉంది. శ్రీశైలంలో రెండు రాష్ట్రాలూ పవర్ జనరేషన్ చేస్తున్నప్పటికీ, తన వాటాకి మించి తెలంగాణ వాడుకుంటోందని ఆంధ్రా అంటోంది. విద్యుదుత్పత్తిని చేయాల్సిన దానికంటే ఎక్కువ చేస్తూ పెద్దమొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తోందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
అంతేకాదు, నాగార్జునసాగర్‌కు నీటి అవసరాలు లేని టైమ్‌లో పవర్ జనరేషన్ చేయడాన్ని ఆంధ్రా తప్పుబడుతోంది. మరి, ఏపీ కంప్లైంట్‌పై తెలంగాణ ఎప్పుడు రియాక్టవుతుందో? ఎలాంటి రియాక్షన్ ఇస్తుందోనన్నది ఉత్కంఠ రేపుతోంది. ప్రజెంట్ సీన్ చూస్తుంటే మాత్రం ఏపీ, తెలంగాణ మధ్య జలజగడం మళ్లీ ముదిరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయ్.