పోలీసుశాఖలో సైంటిఫిక్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఫోరెన్సిక్ విభాగంలో 58 సైంటిఫిక్ అసిస్టెంట్ల పోస్టులను భర్తీ చేయడానికి ఏపీ పోలీస్ రిక్రూట్​మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోలీసుశాఖలో సైంటిఫిక్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Updated on: Nov 02, 2020 | 10:41 PM

ఫోరెన్సిక్ విభాగంలో 58 సైంటిఫిక్ అసిస్టెంట్ల పోస్టులను భర్తీ చేయడానికి ఏపీ పోలీస్ రిక్రూట్​మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 2 నుంచి 22 సాయంత్రం 5 గంటల వరకు ఆన్​లైన్ లో అప్లై చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. మరిన్ని వివరాల కోసం slprb.ap.gov.in సంప్రదించవచ్చని అభ్యర్ధులకు సూచించింది. ఫోరెన్సిక్ సైన్స్​లో ఫిజిక్స్, కెమికల్ & బయాలజీ/సెరాలజీ, ప్రయోగశాలకు సంబంధించిన ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ /సెరాలజీలో 22,  సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజిక్స్-18, సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్-17 పోస్టులు ఖాళీగా ఉన్నాయని బోర్డు  ప్రకటనలో తెలిపింది.

Also Read :

కరోనా అప్‌డేట్ : ఏపీలో కొత్తగా 1,916 పాజిటివ్ కేసులు

క్షణికావేశంలో భర్తను, అత్తమామలను చంపిన మహిళ