ఏపీలో ఓటర్ల జాబితా సవరణకు అవకాశం.. తేదీలివే..

ఏపీలో ఓటర్ల జాబితా సవరణకు అవకాశం.. తేదీలివే..

ఏపీలోని ఫోటో ఓటర్ల జాబితా సవరణకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల కమిషన్ తాజాగా ఓ కీలక ప్రకటనను జారీ చేసింది. కొత్తగా పేర్ల నమోదు, మార్పులు, అభ్యంతరాల...

Ravi Kiran

|

Aug 10, 2020 | 11:19 PM

Photo Voter List Updation In AP: మీ ఓటర్ కార్డులో తప్పులున్నాయా.? వాటిని సవరించుకోవాలని చూస్తున్నారా.? అయితే దాన్ని మార్చుకునే ఛాన్స్ వచ్చింది. ఏపీలోని ఫోటో ఓటర్ల జాబితా సవరణకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల కమిషన్ తాజాగా ఓ కీలక ప్రకటనను జారీ చేసింది. కొత్తగా పేర్ల నమోదు, మార్పులు, అభ్యంతరాల స్వీకరణకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది.

ఓటర్ల జాబితాలోని అభ్యంతరాలపై అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. అలాగే సవరించిన ఓటర్ల జాబితాతో ముసాయిదాను నవంబర్ 16న ప్రకటిస్తామంది. ఇక సవరించిన ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉన్నా.. డిసెంబర్ 15 వరకు స్వీకరిస్తామని.. 2021 జనవరి 15న ఫోటో ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.

Also Read:

ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త.. ప్రీమియం చెల్లించని వారికి మరో ఛాన్స్..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వేలిముద్ర లేకుండా పింఛన్ల పంపిణీ..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu