ఈ ఏడాది ఇంటర్ చదువుతా.. హెచ్ఆర్‌డీ మినిస్టర్

పదో తరగతి వరకే చదివిన తాను హెచ్ఆర్డీ శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో తన సామర్థ్యాన్ని ప్రశ్నించినప్పుడు చాలా బాధ కలుగుతున్నదని ఆయన అన్నారు. అందుకే ఈ ఏడాది 11వ తరగతిలో...

ఈ ఏడాది ఇంటర్ చదువుతా.. హెచ్ఆర్‌డీ మినిస్టర్
Follow us

|

Updated on: Aug 11, 2020 | 12:09 AM

చదువు.. ఎంతో మందిని ఉన్నత శిఖరాలను చేర్చుతుంది. మరెంతో మందిని లక్షం వైపు పరుగులు పెట్టిస్తుంది. అయితే కొందరు ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించినా..  అలాగా జార్ఖండ్ కు చెందిన హెచ్ఆర్డీ మినిస్టర్.. ఎన్నో రాజకీయ ఉన్నత శిఖరాలను అధిరోయించి..ఇప్పుడు ఆ రాష్టానికి మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఈ ఏడాది ఇంటర్‌లో చేరుతున్నానని, కష్టపడి చదువుతానని జార్ఖండ్ హెచ్ఆర్డీ మంత్రి జగ‌ర్నాథ్ మహతో తెలిపారు.

పదో తరగతి వరకే చదివిన తాను హెచ్ఆర్డీ శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో తన సామర్థ్యాన్ని ప్రశ్నించినప్పుడు చాలా బాధ కలుగుతున్నదని ఆయన అన్నారు. అందుకే ఈ ఏడాది 11వ తరగతిలో చేరుతున్నానని మహతో అన్నారు.

జార్ఖండ్‌ వ్యాప్తంగా 4,416 మోడల్ స్కూళ్లను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. వీటి ఏర్పాటుతో విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు మరిన్ని సౌకర్యాలు ఒనగూరుతాయని అన్నారు. దీనికి సంబంధించిన ఫైల్‌పై సోమవారం సంతకం చేసినట్లు ఆయన చెప్పారు.