విజయవాడలో కరోనా టెర్రర్.. కంటైన్మెంట్ జోన్లుగా 42 డివిజన్లు..

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రానికి వ్యాపార రాజధానిగా పేరున్న బెజవాడలో కరోనా కేసులు హడలెత్తిస్తుండటంతో కృష్ణా జిల్లా కలెక్టర్ మంగళవారం రాత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు.

విజయవాడలో కరోనా టెర్రర్.. కంటైన్మెంట్ జోన్లుగా 42 డివిజన్లు..

Edited By:

Updated on: Jun 10, 2020 | 10:51 AM

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రానికి వ్యాపార రాజధానిగా పేరున్న బెజవాడలో కరోనా కేసులు హడలెత్తిస్తుండటంతో కృష్ణా జిల్లా కలెక్టర్ మంగళవారం రాత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలోని 64 డివిజన్లకు గాను 42 డివిజన్లను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షలు యధావిధిగా అమలవుతాయని.. రూల్స్ తక్షణమే అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

మొత్తం 42 కంటైన్మెంట్ జోన్లలో దాదాపు 200 ప్రాంతాలు కరోనా కేసులతో నిండిపోయాయి. దీనితో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ప్రకటన వెల్లడించే వరకు విజయవాడలో లాక్ డౌన్ అమలులో ఉంటుందన్నారు. కాగా, ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ యాక్ట్ 2005 ప్రకారం ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ తెలిపారు.

Also Read: 

జగన్ కీలక నిర్ణయం.. వారందరికీ ఇసుక ఉచితం..

అంతర్రాష్ట్ర సర్వీసులపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..

జగన్ కీలక నిర్ణయం.. త్వరలోనే వైద్యశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.!

దసరా వరకు స్కూల్స్ తెరిచే ప్రసక్తి లేదు..!

కిమ్‌శకం ఇక ముగిసినట్లేనా.? ఆ ఇద్దరిలో ఒకరికి పగ్గాలు.!