AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తైవాన్ ప్రతినిధులకు ఏపీ మంత్రి మేకపాటి ప్రజంటేషన్

తైవాన్ భాగస్వామ్యంతో మరింత వేగంగా ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి పాటు పడతామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. తైవాన్ బై సైకిల్ ఎగుమతులకు గల అవకాశాలపై మంత్రి మేకపాటి తైవాన్ ప్రతినిధులకు అమరావతిలో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ-బై సైకిల్ కు గ్రామీణ ప్రాంతాలలో చాలా డిమాండ్ ఉందన్న ఆయన, తైవాన్ కంపెనీల సహకారంతో నాణ్యమైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులలో దేశంలో అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం.. సైకిళ్లు రైతులకు ఎంతో ఉపయోగకరం […]

తైవాన్ ప్రతినిధులకు ఏపీ మంత్రి మేకపాటి ప్రజంటేషన్
Venkata Narayana
|

Updated on: Nov 06, 2020 | 1:35 PM

Share

తైవాన్ భాగస్వామ్యంతో మరింత వేగంగా ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి పాటు పడతామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. తైవాన్ బై సైకిల్ ఎగుమతులకు గల అవకాశాలపై మంత్రి మేకపాటి తైవాన్ ప్రతినిధులకు అమరావతిలో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ-బై సైకిల్ కు గ్రామీణ ప్రాంతాలలో చాలా డిమాండ్ ఉందన్న ఆయన, తైవాన్ కంపెనీల సహకారంతో నాణ్యమైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులలో దేశంలో అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రధాన రాష్ట్రం.. సైకిళ్లు రైతులకు ఎంతో ఉపయోగకరం అని మేకపాటి చెప్పుకొచ్చారు. ఇవాళ రాజధాని అమరావతిలో తైవాన్ డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్ ఆధ్వర్యంలో కీలక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మంత్రి మేకపాటితో ప్రఖ్యాత తైవాన్ కంపెనీల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తైవాన్ కు చెందిన కంపెనీలు.. ఫోక్స్ లింక్, అపాచ్, పీఎస్ఏ వాల్సిన్, గ్రీన్ టెక్ ప్రతినిధులు పాల్గొన్నారు. పాలనలో పారదర్శకత, అనుమతులలో వేగం మా బలం అని మేకపాటి తైవాన్ ప్రతినిధులకు వెల్లడించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్, కొప్పర్తి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని మంత్రి తెలిపారు. భూములు, నైపుణ్య మానవవనరులు, నీరు, విద్యుత్, పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఏ మూలకైనా వెళ్లేలా రహదారుల వంటి వనరులకు ఏపీలో కొదవలేదని మంత్రి తైవాన్ టీంకు వివరించారు.