ట్రంప్ కు షాకిచ్చిన ఫేస్ బుక్, ట్విట్టర్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు అధికారం దూరమవుతుందన్న సంకేతాల వేళ ఫేస్ బుక్, ట్విట్టర్ కూడా ట్రంప్ కు తాజాగా షాకిచ్చాయి. పోలింగ్ అనంతరం మొదటిసారి ట్రంప్ చేసిన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేసి టీవీ ఛానళ్లు జర్క్ ఇస్తే, ట్రంప్ పెట్టిన పోస్టులను తొలగించి ప్రముఖ సామాజిక మాధ్యమాలు ఫేస్ బుక్, ట్విట్టర్ కూడా డోనాల్డ్ ట్రంప్ కు ఝలక్ ఇచ్చాయి. ప్రత్యర్థి బైడెన్ టీమ్, తన విజయాన్ని దొంగిలించాలని చూస్తోందని ట్రంప్ చేసిన ట్వీట్ […]

ట్రంప్ కు షాకిచ్చిన ఫేస్ బుక్, ట్విట్టర్
Follow us

|

Updated on: Nov 06, 2020 | 1:09 PM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు అధికారం దూరమవుతుందన్న సంకేతాల వేళ ఫేస్ బుక్, ట్విట్టర్ కూడా ట్రంప్ కు తాజాగా షాకిచ్చాయి. పోలింగ్ అనంతరం మొదటిసారి ట్రంప్ చేసిన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేసి టీవీ ఛానళ్లు జర్క్ ఇస్తే, ట్రంప్ పెట్టిన పోస్టులను తొలగించి ప్రముఖ సామాజిక మాధ్యమాలు ఫేస్ బుక్, ట్విట్టర్ కూడా డోనాల్డ్ ట్రంప్ కు ఝలక్ ఇచ్చాయి. ప్రత్యర్థి బైడెన్ టీమ్, తన విజయాన్ని దొంగిలించాలని చూస్తోందని ట్రంప్ చేసిన ట్వీట్ ను ట్విట్టర్ తొలగించింది. “మనమే ముందున్నాం. అయితే, వారు ఈ ఎన్నికలను చోరీ చేయాలని చూస్తున్నారు. దాన్ని జరుగనివ్వం. ఎన్నికలు ముగిసిన తరువాత ఓట్లను వేయనిచ్చేది లేదు” అంటూ ట్రంప్ తన సందేశంలో పేర్కొన్నారు. అయితే, ఈ ట్వీట్ వివాదాస్పదమైనదని, పౌర సమాజంలో జరుగుతున్న ఎన్నికల విధానంపై తప్పుడు సంకేతాలు పంపించేలా ఉందంటూ ట్విట్టర్ ట్రంప్ ట్వీట్ ను తొలగించింది. తన ఫేస్ బుక్ ఖాతాలో సైతం ట్రంప్ ఇదే సందేశం పెట్టగా, ఫేస్ బుక్ యాజమాన్యం కూడా ఆ పోస్టును తొలగిస్తూ.. తొలి దశ ఓట్ల లెక్కింపుతో పోలిస్తే, తుది ఫలితం వేరుగా ఉండవచ్చు. ఓట్ల లెక్కింపుకు రోజులు, వారాల సమయం కూడా పడుతుంది. ఈ సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు సరికాదంటూ వ్యాఖ్యానించి ట్రంప్ పెట్టిన పోస్టును డిలీట్ చేసింది.