‘రాష్ట్రంలో నడుస్తోంది ఎన్నికల కమిషన్ కాదు.. నిమ్మగడ్డ కమిషన్’

“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తోంది ఎన్నికల కమిషన్ కాదు.. అది నిమ్మగడ్డ కమిషన్” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి కన్నబాబు. అయన వ్యక్తిగత ఈగో కోసం, అయన ఇష్టాల కోసం కమిషన్ నడుపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వంతో చర్చించకుండా ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ప్రజలకి ఇది అర్థమైందన్నారు. ప్రభుత్వాన్ని కించపర్చడమే అయన ఉద్దేశ్యమని.. ఈ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఉన్న వారికి నిమ్మగడ్డ సహాయం చేస్తున్నారని కన్నబాబు ఆరోపించారు. “ముఖ్యమంత్రికి కూడా తెలియకుండా ఎన్నికలు వాయిదా వేశారు. […]

  • Venkata Narayana
  • Publish Date - 1:21 pm, Wed, 28 October 20
'రాష్ట్రంలో నడుస్తోంది ఎన్నికల కమిషన్ కాదు.. నిమ్మగడ్డ కమిషన్'

“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తోంది ఎన్నికల కమిషన్ కాదు.. అది నిమ్మగడ్డ కమిషన్” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి కన్నబాబు. అయన వ్యక్తిగత ఈగో కోసం, అయన ఇష్టాల కోసం కమిషన్ నడుపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వంతో చర్చించకుండా ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ప్రజలకి ఇది అర్థమైందన్నారు. ప్రభుత్వాన్ని కించపర్చడమే అయన ఉద్దేశ్యమని.. ఈ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఉన్న వారికి నిమ్మగడ్డ సహాయం చేస్తున్నారని కన్నబాబు ఆరోపించారు. “ముఖ్యమంత్రికి కూడా తెలియకుండా ఎన్నికలు వాయిదా వేశారు. రాజకీయ పార్టీలతో మాట్లాడే ముందు ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. తెలుగుదేశం, వారి మిత్ర పార్టీలతో ఈ సమావేశం జరుగుతుంది. రాజకీయ పక్షాలు ఎన్నికలు పెట్టమంటున్నాయి అని చెప్పడం కోసం నిమ్మగడ్డ ఈ మీటింగ్ పెట్టారు. కేంద్రంకు రాసిన ఉత్తరంలో ఇది ఫ్యాక్షనిస్ట్ ప్రభుత్వం అని మమ్మల్ని విమర్శించారు. ముఖ్యమంత్రి ఆలోచన అంతా వ్యవస్థల పనితీరు గురించే, వ్యక్తిగతంగా సీఎంకు ఎవరిపైనా కోపం ఉండదు. ఒకసారి ఇలా వ్యవస్థ పనిచేస్తే ఇది భవిష్యత్తులో ఆనవాయితీ అవుతుంది. ఇన్ని ఎన్నికల హామీలు నిలబెట్టుకుని మేము ఎన్నికలకు ఎందుకు బయపడుతాం? ఒకవేళ ఎన్నికలకు రమేష్ కుమార్ సిద్దం అయితే, ఉన్నత స్థాయిలో చర్చించి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. కరోనా ప్రారంభంలో ఎన్నికలు వాయిదా వేశారు. ఇప్పుడు ఇన్ని కేసులు నమోదు అవుతుంటే ఎన్నికలు నిర్వహించగలరా” అని కన్నబాబు టీవీ9తో వ్యాఖ్యానించారు.