AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ 2020: RCB Vs MI, టాప్ ప్లేస్ కోసం పోటాపోటీ…

ఐపీఎల్ 2020లో భాగంగా నేడు అబుదాబీ వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలబడనున్నాయి. టాప్ ప్లేస్ కోసం ఇరు జట్ల...

ఐపీఎల్ 2020: RCB Vs MI, టాప్ ప్లేస్ కోసం పోటాపోటీ…
Ravi Kiran
|

Updated on: Oct 28, 2020 | 1:33 PM

Share

IPL 2020: ఐపీఎల్ 2020లో భాగంగా నేడు అబుదాబీ వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలబడనున్నాయి. టాప్ ప్లేస్ కోసం ఇరు జట్ల మధ్య ఈ పోరు పోటాపోటీగా సాగనుంది. ఈ లీగ్‌లో ఇప్పటిదాకా ముంబై, బెంగళూరు చెరో 11 మ్యాచ్‌లు ఆడగా.. ఏడింటిలో విజయం సాధించి.. నాలుగింటిలో ఓడిపోయాయి. రెండో అర్ధభాగంలో ఓటములు ఎదుర్కున్న ఈ జట్లు.. గెలుపు కోసం తహతహలాడుతున్నాయి.

ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వస్తే.. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తోంది. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రతీ మ్యాచ్‌లోనూ ఓపెనర్లు ఆరోన్ ఫించ్, పడిక్కల్ మంచి శుభారంభాన్ని ఇస్తుంటే.. మిడిల్ ఆర్డర్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ యాంకర్ రోల్ పోషిస్తున్నాడు. ఇక చివరిలో మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ మెరుపులు మెరిపిస్తూ జట్టుకు భారీ స్కోర్లను అందిస్తున్నాడు. బౌలింగ్ విభాగంలో ఆల్‌రౌండర్ మోరిస్, చాహాల్‌లు రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో వికెట్లు తీస్తుండగా.. సైనీ, సుందర్, సిరాజ్ వీరికి సహకారాన్ని అందిస్తున్నారు. అయితే ఆర్సీబీ మైనస్ మాత్రం డెత్ బౌలింగ్.. దాన్ని ఈ మ్యాచ్‌లో సాల్వ్ చేస్తారో.? లేదో.? చూడాలి.!

అటు ముంబై ఇండియన్స్‌లో కూడా చెప్పుకోదగ్గ లోపాలు ఏమి లేవు. లీగ్‌లోనే అద్భుత బౌలింగ్ లైనప్ ఈ జట్టు సొంతం. అయితే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ముంబై బౌలర్లు తేలిపోయారు. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. వారు ఈ మ్యాచ్‌కు ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బుమ్రా, బౌల్ట్, రాహుల్ చాహార్, పాటిన్సన్‌తో ముంబై బౌలింగ్ విభాగం బలంగా ఉంది. అలాగే బ్యాటింగ్‌ విభాగం డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, పొలార్డ్‌లతో పటిష్టంగా ఉంది.  కాగా, ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకునే మొదటి బృందంగా నిలుస్తుంది.

Also Read:

ముంబై ఇండియన్స్‌కు షాక్.. టోర్నీ వీడనున్న హిట్‌మ్యాన్.!

మధ్యాహ్న భోజన పధకంలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..

భక్తులకు శుభవార్త.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల..

రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులిటెన్..

ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా