స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం.. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం ముందు కొనసాగుతున్న వాదనలు
సుప్రీంకోర్టులో విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది.
Supreme Court Hearing : సుప్రీంకోర్టులో విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు ధర్మాసనం. కొద్దిసేపటి కిందటే విచారణ మొదలైంది. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు వేసిన పిటిషన్లపై వాదనలు కొనసాగుతున్నాయి. ఎస్ఈసీ కేవియట్ పిటిషన్ వేసింది. దీంతో ఆ వాదనలు కూడా వింటుంది. అత్యున్నత ధర్మాసనం ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుందనేది ఆసక్తిగా మారింది. జస్టిస్ సంజయ్ కిషన్‌కౌల్ ధర్మాసనం ముందు ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి.
జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్ కూడిన ధర్మాసనం రెండు కేసులకు సంబంధించి విచారణ చేపట్టింది. ఇరు వర్గాలకు చెందిన న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. కాగా, ఇదివరకే సింగిల్ జడ్జి బెంచ్ తీర్పును కొట్టివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతినిచ్చింది హైకోర్టు డివిజన్ బెంచ్. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు స్థానిక ఎన్నికలను మరో 3 నెలల పాటు వాయిదా వేయాలని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు పిటిషన్ దాఖలు చేశారు.