ఇకపై డిగ్రీ నాలుగేళ్లు.. గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్!

| Edited By:

Dec 29, 2019 | 5:17 PM

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి వైఎస్ జగన్. అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాగా తాజాగా ఆయన విద్యావిధానంలో సంచలన మార్పులు చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఇకపై డిగ్రీ కోర్సును నాలుగేళ్లుగా చేస్తూ.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇదివరకూ ఇదే విషయాన్ని ప్రస్తావించినా ఎప్పటి నుంచి.. ఎలా స్టార్ట్ చేయాలన్నదానిపై క్లారిటీ రాలేదు. అయితే తాజాగా.. వివిధ శాఖల అధికారులతో జగన్ చర్చించి ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇప్పటి వరకూ డిగ్రీ […]

ఇకపై డిగ్రీ నాలుగేళ్లు.. గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్!
Follow us on

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి వైఎస్ జగన్. అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాగా తాజాగా ఆయన విద్యావిధానంలో సంచలన మార్పులు చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఇకపై డిగ్రీ కోర్సును నాలుగేళ్లుగా చేస్తూ.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇదివరకూ ఇదే విషయాన్ని ప్రస్తావించినా ఎప్పటి నుంచి.. ఎలా స్టార్ట్ చేయాలన్నదానిపై క్లారిటీ రాలేదు. అయితే తాజాగా.. వివిధ శాఖల అధికారులతో జగన్ చర్చించి ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

ఇప్పటి వరకూ డిగ్రీ మూడేళ్ల కోర్సుగా ఉంది. ఇక వచ్చే ఏడాది నుంచి నాలుగేళ్ల కోర్సుగా మారనుంది. మొన్నటి వరకూ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు చేయగా.. తాజాగా ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ కే హేమచంద్రారెడ్డి తెలిపారు. దీంతో.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల డిగ్రీ కోర్సు విధానాన్ని అమల్లోకి తెస్తున్నామన్నారు. మూడేళ్లు డిగ్రీ కోర్సు, మరొక సంవత్సరం అదనంగా అప్రెంటిస్ షిప్ ప్రోగ్రాం మొదలుపెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉన్నత విద్యామండలికి ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన చెప్పారు. ఈ లాస్ట్ ఇయర్‌లో కాలేజీలోనే వివిధ కోర్సులను నేర్పిస్తామని, దీంతో విద్యార్థులకు పలు జాబ్‌లపై అవగాహన ఏర్పడుతుందన్నారు.