అమర జవాన్ల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వ సహాయం
అమరావతి పుల్వామా ఉగ్రదాడి ఘటనలో ప్రాణాలు విడిచిన అమర వీరుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం సహాయం ప్రకటించింది. ఒక్కో అమర జవాన్ కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున సహాయం ప్రకటిస్తున్నామని సీఎం తెలిపారు. పుల్వామా ఉగ్రదాడి ఘటన బాధాకరమని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరకుండా కేంద్ర, రాష్ట్రాలు పటిష్ట వ్యూహాన్ని అనుసరించాలని సీఎం […]
అమరావతి
పుల్వామా ఉగ్రదాడి ఘటనలో ప్రాణాలు విడిచిన అమర వీరుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం సహాయం ప్రకటించింది. ఒక్కో అమర జవాన్ కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున సహాయం ప్రకటిస్తున్నామని సీఎం తెలిపారు. పుల్వామా ఉగ్రదాడి ఘటన బాధాకరమని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరకుండా కేంద్ర, రాష్ట్రాలు పటిష్ట వ్యూహాన్ని అనుసరించాలని సీఎం సూచించారు. అమరుల త్యాగాలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. జవాన్ల కుటుంబాలకు ప్రతిఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.