ఏపీ ఇంటర్ విద్యార్థలుకు మరో అవకాశం.. రిజిస్ట్రేన్ల గడువు పొడిగింపు

కరోనా ప్రభావంతో ఇంటర్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం ఆన్‌లైన్‌ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్‌ గడువును నవంబరు 6 వరకు పొడిగించింది.

ఏపీ ఇంటర్ విద్యార్థలుకు మరో అవకాశం.. రిజిస్ట్రేన్ల గడువు పొడిగింపు
Follow us

|

Updated on: Oct 30, 2020 | 7:18 AM

కరోనా మహమ్మారి ప్రభావంతో ఏడాది విద్యా వ్యవస్థ రూపరేఖలే మారిపోయారు. జూన్ నెలలో పూర్తి కావల్సిన ఆడ్మిషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. క్లాసు రూమ్ కు వెళ్లకుండానే పాఠాలు సాగుతున్నాయి. తాజా కరోనా ప్రభావంతో ఇంటర్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం ఆన్‌లైన్‌ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్‌ గడువును నవంబరు 6 వరకు పొడిగించినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ గురువారం తెలిపారు. ఈ నెల 21నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా గురువారంతో గడువు ముగిసింది. అయితే, చాలా కాలేజీలను వెబ్‌లో సరియైన వివరాలను పెట్టకపోవడంతో లక్షల మంది విద్యార్థులు గడువులోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదు. దీంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేన్ల సమర్పణ గడువును 6 వరకు పొడిగించినట్లు ఇంటర్‌ బోర్డు పేర్కొంది. విద్యార్థులు మరోసారి ఈ అవకాశాన్ని వినియోగించాలని సూచించింది.