ఏపీ ఎంసెట్ అభ్యర్థులకు.. నేడే లాస్ట్ ఛాన్స్..

ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక. ఎంసెట్ దరఖాస్తులలో తప్పుల సరిదిద్దుకునే గడువు నేటితో ముగియనుంది.

ఏపీ ఎంసెట్ అభ్యర్థులకు.. నేడే లాస్ట్ ఛాన్స్..

Updated on: Jul 07, 2020 | 12:21 PM

ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక. ఎంసెట్ దరఖాస్తులలో తప్పుల సరిదిద్దుకునే గడువు నేటితో ముగియనుంది. తాజాగా ఎంసెట్‌తో పాటు ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఉన్నత విద్యామండలి అభ్యర్ధులకు మరో అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఎంసెట్‌కు ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు ఛాన్స్ ఇచ్చారు.

అలాగే ఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్‌ పరీక్షలకు జూలై 7 నుంచి 10వ తేదీ వరకు, ఐసెట్‌, పీజీఈసెట్‌లకు ఈ నెల 10 నుంచి 13 వరకు, పీఈసెట్ పరీక్షకు ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో తప్పులు సరిద్దిదుకునే అవకాశాన్ని ఉన్నత విద్యామండలి అధికారులు కల్పించారు. కాగా, ఈ ఏడాది ఎంసెట్‌కు 2,71,598 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈసెట్‌కు 36,274, ఐసెట్‌కు 64,690, పీజీఈసెట్‌కు 27,057, లాసెట్‌కు 16,028, ఎడ్‌సెట్‌కు 13,521, పీఈసెట్‌కు 2,578 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.