ఏపీలో మత్స్యకారులకు అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో కూడిన బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం
ఆంధ్రప్రదేశ్ లోని మత్స్యకారులకు గుడ్ న్యూస్: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో కూడిన బృహత్తర ప్రాజెక్టుకు ఏపీ సర్కారు శ్రీకారం చుట్టింది. తొలిదశలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించనున్న నాలుగు ఫిషింగ్ హార్బర్లకు సీఎం వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో ఇవాళ శంకుస్థాపన చేశారు. మరో నాలుగు చోట్ల కూడా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు […]
ఆంధ్రప్రదేశ్ లోని మత్స్యకారులకు గుడ్ న్యూస్: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో కూడిన బృహత్తర ప్రాజెక్టుకు ఏపీ సర్కారు శ్రీకారం చుట్టింది. తొలిదశలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించనున్న నాలుగు ఫిషింగ్ హార్బర్లకు సీఎం వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో ఇవాళ శంకుస్థాపన చేశారు. మరో నాలుగు చోట్ల కూడా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కూడా జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాదు, రాష్ట్రంలో 25 ఆక్వాహబ్‌ల నిర్మాణ పనులకు కూడా సీఎం జగన్ ఇవాళే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. వీటితో పాటు నియోజకవర్గానికో ఆక్వాహబ్ నిర్మాణం చేపడుతున్నామని. . జనతా బజార్లలో నాణ్యమైన రొయ్యలు, చేపలను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిషరీస్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆర్డినెన్స్ తెచ్చామని సీఎం గుర్తుచేశారు.