‘సీఎం రిలీఫ్ ఫండ్’ విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం..ప్రజాప్రతినిధులకు సూచనలు

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం అందింది. పేదల వైద్యానికి ఆపన్న హస్తం అందిస్తోన్న సీఎం రిలీఫ్ ఫండ్ ప్రక్షాళన దిశగా జగన్  ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.

'సీఎం రిలీఫ్ ఫండ్' విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం..ప్రజాప్రతినిధులకు సూచనలు

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం అందింది. పేదల వైద్యానికి ఆపన్న హస్తం అందిస్తోన్న సీఎం రిలీఫ్ ఫండ్ ప్రక్షాళన దిశగా జగన్  ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇక మీదట సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు దుర్వినియోగం పక్కా ప్రణాళికను అమలు చేయనున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే జబ్బులకు సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు ఇవ్వకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే చికిత్స ఖర్చులకి సంబంధించి ఎటువంటి  రీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తులను స్వీకరించవద్దని సీఎం కార్యాలయం ప్రజాప్రతినిధులకు సూచనలు చేసినట్లు తెలిసింది.

ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 2434 జబ్బులకు చికిత్స అందిస్తున్నామని సీఎం రిలీఫ్ ఫండ్ ఇన్చార్జ్ హరికృష్ణ తెలిపారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించే 2434 జబ్బులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద దరఖాస్తులను స్వీకరించద్దని అని ఆయన సూచించారు. ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చే జబ్బులను.. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకునేలా ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించాలని సీఎం ఆఫీస్ నుంచి ప్రజాప్రతినిధులకు ఆదేశాలు అందాయి. ఆరోగ్య శ్రీ పరిధిలోకి రాని జబ్బులకు మాత్రమే సీఎం రిలీఫ్ ఫండ్ క్లైములు దరఖాస్తులను తీసుకోవాలని, అది కూడా ప్రజా ప్రతినిధుల పీఏలు మాత్రమే పంపాలని సీఎంఓ సూచించింది.

Also Read :

సాయం చేస్తే మోసం..చంపుతామని బెదిరింపులు..పోలీసులను ఆశ్రయించిన వందేమాతరం

ఈమె అందంతో కుర్రకారు షేక్, రెమ్యూనరేషన్‌తో ప్రొడ్యూసర్లు షాక్ !

కోవిడ్ బారినపడ్డ జూనియర్‌ ట్రంప్‌..ప్రస్తుతం క్వారంటైన్..నో సింటమ్స్

 

Click on your DTH Provider to Add TV9 Telugu