విశాఖ ఉత్సవ్‌లో సీఎం జగన్

ఆర్కేబీచ్‌లోని విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపు రెండు రోజుల పాటు విశాఖ ఉత్సవ్ కొనసాగనుంది. సీఎం జగన్ రాక సందర్భంగా విశాఖలో అభిమానుల సందడి నెలకొంది. అడుగడుగునా జగన్‌కు ప్రజలు నీరాజనాలు పలుకుతూ మానవహారం చేశారు. కాగా.. ఈ కార్యక్రమానికి భారీగా సందర్శకులు తరలివచ్చారు. విశాఖ ఉత్సవ్‌లో భాగంగా.. ఏర్పాటు చేసిన లేజర్ షో హైలెట్‌గా నిలిచింది. ఈ […]

  • Tv9 Telugu
  • Publish Date - 6:53 pm, Sat, 28 December 19
విశాఖ ఉత్సవ్‌లో సీఎం జగన్

ఆర్కేబీచ్‌లోని విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపు రెండు రోజుల పాటు విశాఖ ఉత్సవ్ కొనసాగనుంది. సీఎం జగన్ రాక సందర్భంగా విశాఖలో అభిమానుల సందడి నెలకొంది. అడుగడుగునా జగన్‌కు ప్రజలు నీరాజనాలు పలుకుతూ మానవహారం చేశారు. కాగా.. ఈ కార్యక్రమానికి భారీగా సందర్శకులు తరలివచ్చారు. విశాఖ ఉత్సవ్‌లో భాగంగా.. ఏర్పాటు చేసిన లేజర్ షో హైలెట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ విశాఖ నేవీ కోస్ట్ సిబ్బందికి చిరు సన్మానం చేశారు. అలాగే.. విశాఖ ఉత్సవ్ కమిటీ నుంచి జగన్‌కు సన్మానం చేశారు.