ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వడ్డీలేని రుణాలపై జరిగిన చర్యలో భాగంగా టీడీపీ నేతలపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను ప్రతిపక్ష సభ్యులు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. వడ్డీలేని రుణాల పేరుతో గత ప్రభుత్వం మహిళల్ని దారుణంగా మోసం చేసిందని ఆయన ఆరోపించారు. దీంతో టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరి అభ్యంతరంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ మేము 150 మంది ఉన్నాం.. మేమంతా లేస్తే మీరు మాట్లాడలేరంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యలో స్పీకర్ తమ్మినేని కలుగజేసుకుని ఇరుపక్షాలను శాంతింపజేశారు.