జగన్ సంచలనాత్మక నిర్ణయం.. నిరుద్యోగుల కోసం మరో కొత్త పథకం!

ఏపీకి సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నారు. తాజాగా నిరుద్యోగుల కోసం మరో అద్భుత పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు. నిరుద్యోగులకు ఆర్ధిక స్వావలంబనను కల్పించే దిశగా వైఎస్సార్ ఆదర్శం పేరుతో సరికొత్త పధకానికి శ్రీకారం చుట్టారు. ఇసుక, నిత్యావసర సరుకులు, మద్యం బాటిళ్ల రవాణా బాధ్యతలను నిరుద్యోగులకు అప్పగించబోతోంది జగన్ సర్కార్. అంతేకాకుండా దీనికి అవసరమయ్యే వాహన సదుపాయాన్ని కూడా ప్రభుత్వమే కల్పించనుంది. […]

జగన్ సంచలనాత్మక నిర్ణయం.. నిరుద్యోగుల కోసం మరో కొత్త పథకం!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 22, 2019 | 8:02 PM

ఏపీకి సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నారు. తాజాగా నిరుద్యోగుల కోసం మరో అద్భుత పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు. నిరుద్యోగులకు ఆర్ధిక స్వావలంబనను కల్పించే దిశగా వైఎస్సార్ ఆదర్శం పేరుతో సరికొత్త పధకానికి శ్రీకారం చుట్టారు. ఇసుక, నిత్యావసర సరుకులు, మద్యం బాటిళ్ల రవాణా బాధ్యతలను నిరుద్యోగులకు అప్పగించబోతోంది జగన్ సర్కార్. అంతేకాకుండా దీనికి అవసరమయ్యే వాహన సదుపాయాన్ని కూడా ప్రభుత్వమే కల్పించనుంది. అందుకోసం 6000 ట్రక్కులు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఆర్ధిక సహకారాన్ని అందించబోతోంది.

ఇక ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు సామాజిక వర్గాలు లబ్ది పొందే అవకాశం ఉంది. ఆయా సామజిక వర్గాల కార్పొరేషన్స్ ద్వారా ఫైనాన్స్ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించనుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులను జారీ చేశారు. అగ్ర వర్ణ నిరుద్యోగులకు ఈ పథకం వర్తించదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులకు మాత్రమే వర్తించేలా దీన్ని రూపొందించామంటూ ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా నిరుద్యోగులు ప్రతి నెలా దాదాపు 20 వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా రీచ్‌ల నుంచి కొనుగోలుదారుల ఇళ్ల వద్దకు ఇసుకను తరలించే బాధ్యత.. అటు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ గోడౌన్ల నుంచి మద్యం బాటిళ్లను ప్రభుత్వ ఆధీనంలోని దుకాణాలకు చేరవేయడంతో పాటుగా.. పౌర సరఫరాల సంస్థ గిడ్డంగుల నుంచి బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను మండల స్థాయి పాయింట్ (ఎంఎస్ఎల్) వరకు రవాణా చేసే పనులు యువతకు దక్కబోతున్నాయి. ఇక ఈ సామాగ్రిని చేరవేయడానికి కావాల్సిన 6000 ట్రుకులను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఆర్ధిక సహకారాన్ని అందించనుంది.

ఇకపోతే ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి రాష్ట్రము, జిల్లా స్థాయిలో కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఛైర్మన్ గా వ్యవహరించే రాష్ట్ర స్థాయి కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు కార్పొరేషన్ల కార్యదర్శులు, గనులు, పౌర సరఫరాల శాఖ కార్యదర్శులు, రవాణా, వాణిజ్య పన్నుల శాఖల కమిషనర్లు, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ సభ్యులుగా, ఖనిజాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సమన్వయకుడిగా ఉంటారు. కలెక్టర్ ఛైర్మన్ గా ఉండే జిల్లా స్థాయి కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, గనుల శాఖ అదనపు డైరెక్టర్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి, జిల్లా రవాణా కమిషనర్, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ సభ్యులుగా, సంయుక్త కలెక్టర్ కన్వీనర్ గా ఉంటారు.