AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ కు షోకాజ్ నోటీసు జారీ..మ‌ళ్లీ బ‌దిలీ

ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ పై ఏపీ ప్ర‌భుత్వం ఇటీవ‌ల‌ బదిలీ వేటు వేసిన సంగ‌తి తెలిసిందే. ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయ‌న్ను..ఏపీఎస్పీ బెటాలియన్ డిజీగా బదిలీ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే ఆర్టీసీ ఎండీగా బాధ్య‌త‌ల నుంచి త‌ప్ప‌కుంటూ మీడియా సమావేశం నిర్వహించారు మాదిరెడ్డి ప్రతాప్. ఈ క్ర‌మంలో ఆయ‌న ప‌లు కీల‌క కామెంట్స్ చేశారు. వైఎస్సార్ హయాంలో తాను ఐటీ శాఖ కార్యదర్శిగా పని చేశానన్న ప్రతాప్.. ఆ సమయంలో కొందరు అధికారులను […]

ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ కు షోకాజ్ నోటీసు జారీ..మ‌ళ్లీ బ‌దిలీ
Ram Naramaneni
|

Updated on: Jul 16, 2020 | 9:38 AM

Share

ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ పై ఏపీ ప్ర‌భుత్వం ఇటీవ‌ల‌ బదిలీ వేటు వేసిన సంగ‌తి తెలిసిందే. ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయ‌న్ను..ఏపీఎస్పీ బెటాలియన్ డిజీగా బదిలీ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే ఆర్టీసీ ఎండీగా బాధ్య‌త‌ల నుంచి త‌ప్ప‌కుంటూ మీడియా సమావేశం నిర్వహించారు మాదిరెడ్డి ప్రతాప్. ఈ క్ర‌మంలో ఆయ‌న ప‌లు కీల‌క కామెంట్స్ చేశారు.

వైఎస్సార్ హయాంలో తాను ఐటీ శాఖ కార్యదర్శిగా పని చేశానన్న ప్రతాప్.. ఆ సమయంలో కొందరు అధికారులను బదిలీ చేసిన ఫైల్స్ పై విచారణ జరిగిందన్నారు. అందులో తనని మాత్రం విచారించలేదని.. అది తన ఇంటిగ్రిటి అని ఉంటంకించారు. తన బదిలీని ప్రభుత్వం విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పిన ఆయన.. అనేక కారణాలతో తన బదిలీ జరిగి ఉండొచ్చని.. ఇలాంటివి స‌ర్వ‌సాధారణం అని చెప్పుకొచ్చారు.

ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై ప్ర‌భుత్వం సీరియ‌స్ అయ్యింది. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్నీ షోకాజ్ నోటీసు జారీ చేశారు. మీడియా స‌మావేశంలో చేసిన వ్యాఖ్య‌ల‌కు గ‌ల కార‌ణాలు 7 రోజుల్లో చూపాల‌ని నోటీసులో పేర్కొన్నారు. రిప్లై ఇవ్వని పక్షంలో క్ర‌మ‌శిక్ష‌ణా చర్యలు తప్పవని వెల్ల‌డించారు. ‘సర్వీసులో ఉన్న ఏ వ్యక్తీ ప్రెస్ మీట్ లో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేలా కామెంట్స్ చేయకూడదు’ అనే నిబంధనను ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. ఈ మేర‌కు మాదిరెడ్డి ప్రతాప్ కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌