AP Assembly Session: ఏపీ అసెంబ్లీ వాయిదా..రెండో రోజు కూడా వాడి వేడిగా చర్చ.. మరోసారి 14 మంది టీడీపీ సభ్యులు సస్పెన్షన్..

| Edited By: Venkata Narayana

Dec 02, 2020 | 12:27 AM

ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా హాట్ హాట్‌గా జరిగాయి. పలు ప్రభుత్వ పథకాలు, బిల్లులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సమావేశాలను బుధవారంకు వాయిదా వేస్తున్నట్లు..

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ వాయిదా..రెండో రోజు కూడా వాడి వేడిగా చర్చ.. మరోసారి 14 మంది టీడీపీ సభ్యులు సస్పెన్షన్..
Follow us on

AP Assembly Sessions: ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా హాట్ హాట్‌గా జరిగాయి. పలు ప్రభుత్వ పథకాలు, బిల్లులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సమావేశాలను బుధవారంకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వరుసగా రెండో రోజు స్పీకర్ తమ్మినేని సీతారాం 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్  చేశారు. అసెంబ్లీలో టిడ్కొ ఇళ్లపై వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీనితో టీడీపీ సభ్యుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని.. చంద్రబాబు మినహా టీడీపీ సభ్యులందరినీ ఒక్క రోజు పాటు సస్పెండ్ చేశారు.

టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవాని, చినరాజప్ప, జోగేశ్వర రావు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, వెలగపూడి రామకృష్ణ, బివిడి స్వామి, ఏలూరి సాంబశివరావు, రామరాజు, గణబాబు, బెండలం అశోక్, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్ ఒక్క రోజు పాటు సస్పెండ్ అయ్యారు.

కాగా, అసెంబ్లీ తొలి రోజున వరద సాయంపై చర్చ అంటూ పట్టుబట్టిన ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుతో తీవ్ర అసహనానికి గురైన స్పీకర్.. 13 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.