డిసెంబరు 2 నుంచి ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షలు..ఏడు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు అవకాశం..10 రోజుల పాటు పరీక్షలు

తెలంగాణ రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీగెట్ పరీక్షలు‌ డిసెంబరు 2 నుంచి మొదలుకానున్నాయి. ఈ ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌)కు 85,262 మంది పోటీపడనున్నారు.

డిసెంబరు 2 నుంచి ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షలు..ఏడు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు అవకాశం..10 రోజుల పాటు పరీక్షలు
Follow us

|

Updated on: Dec 01, 2020 | 8:48 PM

తెలంగాణ రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీగెట్ పరీక్షలు‌ డిసెంబరు 2 నుంచి మొదలుకానున్నాయి. ఈ ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌)కు 85,262 మంది పోటీపడనున్నారు. గత ఏడాదికంటే ఈసారి సుమారు 6,000 దరఖాస్తులు తగ్గినట్లు సీపీగెట్ కన్వినర్ ఆచార్య కిషన్ తెలిపారు. రోజుకు 3 విడతల వారీగా 10 రోజులపాటు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌తోపాటు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు.

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా పరీక్షా కేంద్రాలను శానిటైజ్‌ చేస్తామని ప్రకటించారు. సీట్ల కంటే తక్కువ దరఖాస్తులు వచ్చినందున ఎంఏ కన్నడ, మరాఠీ, పర్షియన్‌ సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల పరిధిలోని ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమా, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు, జేఎన్టీయూహెచ్‌లోని రెండేళ్ల ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. కాగా, గతంలో ఆయా విశ్వవిద్యాలయాల పరిధిలో వేరువేరు పీజీ సెట్లను నిర్వహించే వారు. అయితే తెలంగాణ ప్రభుత్వం, ఉన్నత విద్యా మండలి ఈసారి అన్ని యూనివర్సిటీలకు కలిపి ఉమ్మడి పీజీ సెట్ ను నిర్వహిస్తోంది.

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్