AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పేరు’ కోసమే సుశాంత్ ప్రయత్నించాడు.. అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు..

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సుశాంత్‌పై పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. సుశాంత్‌కు తాను రెండు సినిమాలు ఆఫర్ చేశానని చెప్పిన అనురాగ్.. వాటిని అతడు తిరస్కరించి పెద్ద బ్యానర్స్‌లో నటించాడని చెప్పుకొచ్చాడు.

'పేరు' కోసమే సుశాంత్ ప్రయత్నించాడు.. అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు..
Ravi Kiran
|

Updated on: Jul 25, 2020 | 6:20 AM

Share

Anurag Kashyap says Sushant Singh Rajput chose Drive over his film: యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం బాలీవుడ్‌ను కుదిపేసింది. ఒక్కసారిగా ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజంపై విమర్శలు వెల్లువెత్తాయి. కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా, మహేష్ భట్ లాంటి ప్రముఖ నిర్మాతలు సుశాంత్‌కు అవకాశాలు రాకుండా చేశారని నెటిజన్లు మండిపడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సుశాంత్‌పై పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. సుశాంత్‌కు తాను రెండు సినిమాలు ఆఫర్ చేశానని చెప్పిన అనురాగ్.. వాటిని అతడు తిరస్కరించి పెద్ద బ్యానర్స్‌లో నటించాడని చెప్పుకొచ్చాడు.

”గతంలో ‘హస్సీ తొహ్ ఫస్సీ’ అనే సినిమా కోసం సుశాంత్‌ను సంప్రదించాను. ముందు దానికి అతడు కూడా అంగీకరించాడు. అయితే ఆ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ ‘యష్ రాజ్’ ఫిలిమ్స్ నుంచి అవకాశం రావడంతో నా సినిమాను పక్కన పెట్టి.. ఆ చిత్రాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడు. YRF పెద్ద నిర్మాణ సంస్థ.. దానితో కలిసి పని చేస్తే కెరీర్ బాగుంటుందని కాబట్టే అది సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ 2016లో కూడా సుశాంత్ కోసం ప్రయత్నించాను. ఒక సినిమా చేయడం కోసం క్యాస్టింగ్ డైరెక్టర్ ముకేష్ చాబ్రాను అతడి దగ్గరకు పంపించాను. సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. అయితే ఆ తర్వాత ”ధోని.. ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ సినిమా విడుదలై పెద్ద సక్సెస్ అయింది.. ఆ తర్వాత మళ్లీ నాకు తిరిగి కాల్ కూడా చేయలేదని అని అనురాగ్ పేర్కొన్నాడు.

నా సినిమాలు తిరస్కరించినందుకు నేను ఏమి అతడిపై కోపం పెంచుకోలేదు. ఎప్పుడైనా బయటవారు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మంచి ఫేం కోసం ప్రయత్నిస్తారు. బడా నిర్మాణ సంస్థల్లో కలిసి పని చేయాలని ఆశిస్తారు. సుశాంత్ కూడా అలాగే.. మొదట్లోనే సక్సెస్ అందుకున్నాడు. తన కెరీర్ ఎలా బాగుంటుందో.. ఆ పరంగా అవకాశాలు ఎంచుకున్నాడని అనురాగ్ కశ్యప్ వెల్లడించాడు. కాగా, ఈ ఇంటర్వ్యూ చూసిన సుశాంత్ ఫ్యాన్స్ అనురాగ్‌పై మండిపడుతున్నారు. అనాల్సిన మాటలు అన్ని కూడా అనేసి.. పైకి కవరింగ్ ఇస్తున్నారా అని విమర్శిస్తున్నారు. అలాగే కంగనా రనౌత్ కూడా అనురాగ్‌ని రెండో కరణ్ జోహార్ అని సంబోధించింది.

Also Read:

సుశాంత్ ఆత్మతో కబుర్లు.. మరిన్ని అనుమానాలు.. వైరలవుతున్న మరో వీడియో..

 సుశాంత్ మరణం వెనుక రహస్యాలు.. షాకింగ్ నిజాలు.. వైరల్ వీడియో..