AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో బాలాకోట్‌ ఎయిర్‌ స్ట్రైక్‌ జరిగిందంటూ.. సోషల్ మీడియాలో పాక్‌ నెటిజన్ల హల్‌చల్..

పాకిస్థాన్‌లో మంగళవారం రాత్రి మరోసారి ఎయిర్‌ స్ట్రైక్‌ జరిగిందంటూ పాకిస్థాన్‌ సోషల్ మీడియా మార్మోగింది. అర్ధరాత్రి సమయంలో కరాచీ సమీపంలో భారత్‌కు చెందిన యుద్ధ విమానాలు పెద్ద ఎత్తున తిరిగాయంటూ పుకార్లు షికార్లు చేశాయి. అంతేకాదు.. 27 ఫిబ్రవరి 2019లో జరిగిన సీన్‌ మరోసారి రిపీట్ అయ్యిందంటూ మరికొన్ని వార్తలు హల్‌చల్ చేశాయి. Extraordinary air activity on #Pak_India border has been observed. #Pakistan security forces are alert. — Tariq Mahmood […]

మరో బాలాకోట్‌ ఎయిర్‌ స్ట్రైక్‌ జరిగిందంటూ.. సోషల్ మీడియాలో పాక్‌ నెటిజన్ల హల్‌చల్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 10, 2020 | 3:23 PM

Share

పాకిస్థాన్‌లో మంగళవారం రాత్రి మరోసారి ఎయిర్‌ స్ట్రైక్‌ జరిగిందంటూ పాకిస్థాన్‌ సోషల్ మీడియా మార్మోగింది. అర్ధరాత్రి సమయంలో కరాచీ సమీపంలో భారత్‌కు చెందిన యుద్ధ విమానాలు పెద్ద ఎత్తున తిరిగాయంటూ పుకార్లు షికార్లు చేశాయి. అంతేకాదు.. 27 ఫిబ్రవరి 2019లో జరిగిన సీన్‌ మరోసారి రిపీట్ అయ్యిందంటూ మరికొన్ని వార్తలు హల్‌చల్ చేశాయి.

బాలాకోట్‌లోని జైషే స్ఠావరాలపై భారత వైమానిక దళం పెద్ద ఎత్తున దాడులు జరిపిందని.. అంతేకాకుండా కరాచీ సమీపంలో ఎయిర్ పెట్రోలింగ్ నిర్వహించిందంటూ కొందరు పాక్ నెటిజన్లు వారి వారి ట్విట్టర్‌ ఖాతాలో పోస్టులు చేశారు. మరికొందరైతే నేను విమానలు వెళ్తుండటాన్ని ప్రత్యక్షంగా చూశానంటూ ట్వీట్ పెట్టడంతో.. పాక్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు చెందారు.

దీనిపై అక్కడి జర్నలిస్టులు కూడా అయోమయానికి గురయ్యారు. నిజంగానే భారత వైమానిక దళం దాడి చేసిందా..? పాక్ వైమానిక దళం దీనిపై ఏం చెప్తుంది అని వారికి వారే ప్రశ్నలు సంధించుకున్నారు. ఇంకొన్ని సోషల్ మీడియా పోస్టులు చూసి అక్కడి వారంతా షాక్‌ తిన్నారు. ఎల్‌ఓసీని దాటి కరాచీ వైపు విమానాలు వెళ్తున్నాయని.. కరాచీ అంతా విద్యుత్ సరఫరా కూడా అధికారులు నిలిపివేశారంటూ కొన్ని ట్వీట్స్‌ వైరల్ అయ్యాయి. ఇక పాకిస్థాన్‌కు చెందిన ఓ జర్నలిస్టు.. ప్రియమైన ఇండియా పాకిస్తాన్‌.. కశ్మీర్‌, సింధ్, రాజస్థాన్‌ మీదుగా భారత వైమానిక దళం పాక్‌లోకి చొరబడిందంటూ పుకార్లు వచ్చాయి. దీనిపై స్పష్టతనివ్వాలంటూ ఇరు దేశాలనుద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ఇదిలావుంటే మరికొందరు మాత్రం.. పాక్‌ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన విమానాలే పెట్రోలింగ్ నిర్వహించి ఉంటాయని పేర్కొన్నారు. మొత్తానికి పాకిస్థాన్‌ ప్రజలు సర్జికల్ స్ట్రైక్, ఎయిర్‌ స్ట్రైక్‌లను నిద్రలో కూడా మర్చిపోకుండా గుర్తుంచుకుంటున్నారని తెలుస్తోందని భారత నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.