ఆంధ్రప్రదేశ్‌ను కరోనా వైరస్ వీడట్లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ వైరస్ వ్యాప్తి కంట్రోల్ కావట్లేదు. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, కృష్ణా, ఈస్ట్ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి.
ఇదిలా ఉంటే గుంటూరులో కరోనా కేసులు పెరుగుతుండటంతో జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి జిల్లా వ్యాప్తంగా షాపులన్నీంటిని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తీసి ఉంచాలని నిర్ణయించారు. జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఆదేశాల మేరకు వ్యాపారాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
అటు కంటైన్‌మెంట్ జోన్లలో షాపులు తెరవకూడదని నిర్ణయం తీసుకున్నారు. గత మూడు రోజుల నుంచి గుంటూరులో నూట యాభైకి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీనితో నగరంలో పలు ప్రాంతాలను అధికారులు కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు. కాగా, అత్యవసరం అయితేనే జనాలు రోడ్లపైకి రావాలని.. బైక్‌పై ఒక్కరు మాత్రమే ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
Also Read:
తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటర్ సిలబస్‌లో 30% కోత.!
భక్తులకు ముఖ్య గమనిక.. వాటి జోలికి వెళ్లొద్దంటూ టీటీడీ హెచ్చరిక..
వారంతా కంపార్ట్‌మెంటల్‌లో పాస్.. ఏపీ ఇంటర్ బోర్డు నిర్ణయం..
ఆ 8 రాష్ట్రాల్లో కరోనా స్వైరవిహారం.. లిస్టులో ఏపీ, తెలంగాణ..!