ఏపీలో కొనసాగుతున్న కరోనా కల్లోలం.. కొత్తగా 1,236 మందికి పాజిటివ్.. వైరస్ బారినపడి 9 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గడంలేదు. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,236 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఏమాత్రం తగ్గడంలేదు. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,236 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కాగా, ఇవాళ మరో 9 మంది కరోనా బారినపడి మృత్యువాత పడినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,57,395కి చేరింది. ఇప్పటి వరకు 6,899 మంది మహమ్మారి ధాటికి మృత్యువాత పడ్డారు.
ఇదిలావుంటే ఏపీలో కోలుకుంటున్న వారి జాబితా క్రమంగా పెరుగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 1,696 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 8,33,980 చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,513 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 69,618 కరోనా పరీక్షలు నిర్వహించగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 93,33,703 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఏపీ సర్కార్ వెల్లడించింది.
ఇక, జిల్లాల వారగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయిః