ఏపీ అసెంబ్లీ కమిటీలు..వల్లభనేని వంశీకి ఓ పదవి..

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో పలు కమిటీలను ఏర్పాటు చేశారు. రూల్స్‌ కమిటీ, పిటీషన్ల కమిటీ, ప్రివిలేజ్‌, హామీల కమిటీ, ఎథిక్స్‌ కమిటీలకు ఛైర్మన్లను నియమించారు. కొత్త ప్రభుత్వంలో కొత్త సభ్యులతో సభ ఏర్పడిన తరువాత ఈ కమిటీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.కొద్ది రోజులుగా రాజకీయంగా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిన వల్లభనేని వంశీకి రూల్స్ కమటీలో స్థానం కల్పించారు. అయితే, రెండో సారి టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన సీనీ హీరో బాలక్రిష్టకు మాత్రం అవకాశం […]

ఏపీ అసెంబ్లీ కమిటీలు..వల్లభనేని వంశీకి ఓ పదవి..

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో పలు కమిటీలను ఏర్పాటు చేశారు. రూల్స్‌ కమిటీ, పిటీషన్ల కమిటీ, ప్రివిలేజ్‌, హామీల కమిటీ, ఎథిక్స్‌ కమిటీలకు ఛైర్మన్లను నియమించారు. కొత్త ప్రభుత్వంలో కొత్త సభ్యులతో సభ ఏర్పడిన తరువాత ఈ కమిటీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.కొద్ది రోజులుగా రాజకీయంగా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిన వల్లభనేని వంశీకి రూల్స్ కమటీలో స్థానం కల్పించారు. అయితే, రెండో సారి టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన సీనీ హీరో బాలక్రిష్టకు మాత్రం అవకాశం దక్కలేదు.

రూల్స్‌ కమిటీ:

ఛైర్మన్‌గా తమ్మినేని సీతారాం

సభ్యులు : ఆనం రామనారాయణరెడ్డి, వెంకటచిన అప్పలనాయుడు, ధర్మాన ప్రసాదరావు, మానుగుంట మహీధరరెడ్డి, బి.అప్పలనాయుడు, వల్లభనేని వంశీ

 

ఎథిక్స్‌ కమిటీ:

ఛైర్మన్‌గా అంబటి రాంబాబు

సభ్యులు : చెన్నకేశవరెడ్డి, ఎం.గజన్మోహన్‌రావు, ఎస్‌.రఘురామిరెడ్డి, అనంత వెంకట రామిరెడ్డి, ఎం.వి.పి.అప్పారావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి

 

పిటీషన్ల కమిటీ :

ఛైర్మన్‌గా డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి

సభ్యులు : కె.శ్రీధర్‌రెడ్డి, వసంత వెంకట కృష్ణప్రసాదు, కాసు మహేష్‌రెడ్డి, ముదునూరి ప్రసాదరాజు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఏలూరి సాంబశివరావు

 

 ప్రివిలేజ్‌ కమిటీ: 

ఛెర్మన్‌గా కాకాని గోవర్థనరెడ్డి

సభ్యులు : వెంకట రమణమూర్తిరాజు, ఎస్‌.వెంకటచిన అప్పలనాయుడు, వి.వరప్రసాదరావు, శిల్పా చక్రపాణిరెడ్డి, ఆనగాని సత్యప్రసాదు, మల్లాది విష్ణు

 

హామీల కమిటీ:

ఛైర్మన్‌గా కొట్టు సత్యనారాయణ

సభ్యులు : పి.పూర్ణచంద్రప్రసాదు, కె.అబ్బయ్యచౌదరి, ఎం.వెంకట మల్లికార్జునరెడ్డి, కె.నాగార్జునరెడ్డి, అబ్దుల్‌ హఫీజ్‌ఖాన్‌, పి.జి.వి.ఆర్‌.నాయుడు.

 

ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ పి.బాలకృష్ణమాచార్యులు అసెంబ్లీ బులెటిన్‌ విడుదల చేశారు.