ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 3620 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ద్వారా తెలిపింది. మరో 16 మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. కాగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,93,299కు చేరింది. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 6,508 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 32,376 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకున్న మొత్తం బాధితుల సంఖ్య 7,54,415 గా ఉంది. ఈ రోజు ఉదయం 10 గంటల వరకు 73,47,776 శాంపిల్స్ టెస్ట్ చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
జిల్లాల వారీగా మృతుల వివరాలు :
కోవిడ్ వల్ల కొత్తగా గుంటూరు జిల్లాలో నలుగురు మరణిించారు. చిత్తూరు ఇద్దరు, తూర్పు గోదావరి ఇద్దరు, ప్రకాశం ఇద్దరు, కృష్ణా ఇద్దరు, అనంతపురం ఒకరు, కడపలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు ప్రాణాలు విడిచారు.
Also Read :
“వాడి పొగరు ఎగిరే జెండా”, అంచనాలకు మించిన తారక్ టీజర్
మహారాష్ట్ర: పిడుగులు పడి ఒకరి మృతి, 26 మందికి గాయాలు