బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసుపై శ్రీముఖి రియాక్షన్

బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసుపై శ్రీముఖి రియాక్షన్

తనకి ఏ వర్గాన్ని కించపరిచే ఉద్ధేశ్యం లేదని, సమాజంలో అన్ని వర్గాలకు తానూ సమాన గౌరవం ఇస్తానని చెప్పింది శ్రీముఖి. తనపై నమోదైన కేసు చూసి షాక్ అయ్యానని పేర్కొంది. ఈ విషయంలో పోలీసులకు అన్ని విధాలుగా సహకరించడానికి..

TV9 Telugu Digital Desk

| Edited By:

May 06, 2020 | 6:31 PM

ఓ ప్రముఖ టీవీ ఛానెల్లో జరిగే ఓ కార్యక్రమంలో శ్రీముఖి బ్రాహ్మణులను అవమాన పరిచినందుకు నల్లకుంటకు చెందిన శర్మ అనే వ్యక్తి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కార్యక్రమ వీడియోలను కూడా చూపించాడు. బ్రాహ్మణులను కించపరిచే విధంగా కామెడీ షోలో దృశ్యాలను చిత్రీకరించారని ఓ ప్రముఖ టీవీ ఛానెల్, యాంకర్ శ్రీముఖిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. కామెడీ షోలో బ్రాహ్మణులను కించపరుస్తూ ఉన్నారంటూ వెంకట రమణ శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు.

కాగా ఈ కేసుపై యాంకర్ శ్రీముఖి స్పందించింది. తనకి ఏ వర్గాన్ని కించపరిచే ఉద్ధేశ్యం లేదని, సమాజంలో అన్ని వర్గాలకు తానూ సమాన గౌరవం ఇస్తానని చెప్పింది శ్రీముఖి. తనపై నమోదైన కేసు చూసి షాక్ అయ్యానని పేర్కొంది. ఈ విషయంలో పోలీసులకు అన్ని విధాలుగా సహకరించడానికి తాను సిద్ధంగానే ఉన్నానని చెప్పింది. అయితే తెలిసో తెలీకో తాను తప్పుు చేసి ఉంటే సారీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది శ్రీముఖి. అలాగే 2018లోనే ఆ షో ముగిసిపోయిందని.. తొలిసారి ప్రసారమైనప్పుడు కంటెంట్ మీద ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఇప్పుడు ఎవరు? ఎందుకు? కేసు వేశారో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చింది శ్రీముఖి. ఆ షోలో ఏ వీడియో క్లిప్ మీద వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో తనకు తెలీదని తెలిపింది. ఏదేమైనా.. తెలిసో తెలీక తప్పు చేసివుంటే వారికి క్షమాపణలు చెప్పడానికి రెడీ అని పేర్కొంది శ్రీముఖి.

Read More:

టీవీ సీరియల్స్ షూటింగ్‌లకు అనుమతిచ్చిన కర్నాటక ప్రభుత్వం

హీరోయిన్ తండ్రిని కత్తితో బెదిరించి.. ఫోన్ లాక్కెళ్లిన దొంగలు

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu