అసలు గురుపౌర్ణమి ఎలా వచ్చింది..?
ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకత ఉన్నట్లే ఈరోజు గురుపౌర్ణమిగా జరుపుకుంటున్నాము. అసలు గురుపౌర్ణమిని ఈరోజు ఎందుకు జరుకుంటారు అంటే పురాణాల ప్రకారంగా వేద వ్యాసుడిని కురుపాండవ వంశాలు గురువుగా కొలిచాయి. అయితే మహాభారతాన్ని రచించిన వ్యాసుని జయంతి రోజును గుర్తు చేసుకుంటూ గురుపౌర్ణమిని జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. గురుపౌర్ణమితో పాటు ఈరోజు మరో ప్రత్యేకత ఉంది. అందరినీ అలరిస్తూ.. ఆసక్తిని రేకెత్తించే చందమామ గురించి చెప్పుకోవడానికి ఎన్నో వింతలు.. విశేషాలు ఉన్నాయి. అలాంటి మరో వింతైన అనుభవాన్ని […]
ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకత ఉన్నట్లే ఈరోజు గురుపౌర్ణమిగా జరుపుకుంటున్నాము.
అసలు గురుపౌర్ణమిని ఈరోజు ఎందుకు జరుకుంటారు అంటే పురాణాల ప్రకారంగా వేద వ్యాసుడిని కురుపాండవ వంశాలు గురువుగా కొలిచాయి. అయితే మహాభారతాన్ని రచించిన వ్యాసుని జయంతి రోజును గుర్తు చేసుకుంటూ గురుపౌర్ణమిని జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. గురుపౌర్ణమితో పాటు ఈరోజు మరో ప్రత్యేకత ఉంది. అందరినీ అలరిస్తూ.. ఆసక్తిని రేకెత్తించే చందమామ గురించి చెప్పుకోవడానికి ఎన్నో వింతలు.. విశేషాలు ఉన్నాయి. అలాంటి మరో వింతైన అనుభవాన్ని ఈ రోజు చూడబోతున్నాం. దాదాపు 150 సంవత్సరాల క్రితం వచ్చిన ఆ సందర్భం మరోసారి వచ్చింది. అదే గురు పౌర్ణమి, చంద్రగ్రహణం కొన్ని గంటల వ్యవధిలో రావడం. ఇలా 1870 జూలై 12న ఒకే సమయంలో చంద్రగ్రహణం, గురు పౌర్ణమి వచ్చాయి.
గురుపౌర్ణమి ఎలా వచ్చింది అంటే.. సాధారణంగా ఆషాడమాసం నుంచి వర్ష రుతువు ప్రారంభం అవుతుంది. సన్యాసాశ్రమం స్వీకరించిన వారు ఆశ్రమ ధర్మంగా ఎక్కడా ఒక చోట ఎక్కువ కాలం వారు గడపరు. కాని వర్షాకాలంలో వానల వలన ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతేకాదు ఆ సమయంలో అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే వీరు ఆషాఢ పౌర్ణమి నుంచి నాలుగు నెలలపాటు ఒకేచోట ఉంటారు. ఆ సమయంలోనే శిష్యులు గురువుల నుంచి జ్ఞానాన్ని పొందుతారు. ఆ సందర్భంగా మొదటి రోజైన ఆషాఢ పౌర్ణమినాడు గురుపూజ చేసేవారు. ఆ ఆచారం ప్రకారం ఈ పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు అని కొందరి అభిప్రాయం.