సుశాంత్‌ది ఆత్మహత్యే, హత్య కాదు, ఢిల్లీ ఎయిమ్స్ ప్రకటన

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది హత్య కాదని, అది ఆత్మహత్యేనని ఢిల్లీ ఎయిమ్స్ కి చెందిన డాక్టర్ల బృందం ప్రకటించింది. ఆయనకు విషం ఇచ్చారనో, గొంతు నులిమి చంపారనో వచ్చిన ఆరోపణలను ఈ బృందం తోసిపుచ్చింది.

సుశాంత్‌ది ఆత్మహత్యే, హత్య కాదు, ఢిల్లీ ఎయిమ్స్ ప్రకటన
Follow us
Umakanth Rao

| Edited By: Ravi Kiran

Updated on: Oct 03, 2020 | 11:18 AM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది హత్య కాదని, అది ఆత్మహత్యేనని ఢిల్లీ ఎయిమ్స్ కి చెందిన డాక్టర్ల బృందం ప్రకటించింది. ఆయనకు విషం ఇచ్చారనో, గొంతు నులిమి చంపారనో వచ్చిన ఆరోపణలను ఈ బృందం తోసిపుచ్చింది. ఈ మేరకు సీబీఐకి తమ మెడికో లీగల్ ఒపీనియన్ ని తెలియజేసింది. సుశాంత్ పోస్ట్ మార్టం, అటాప్సీ రిపోర్టులను ఎయిమ్స్ ఫోరెన్సిక్ డాక్టర్లు సమగ్రంగా విశ్లేషించారు. ఇది సూసైడ్ కేసే తప్ప, మర్డర్ కేసు కాదని ఘటనా స్థలం వద్ద లభ్యమైన ఆధారాల ద్వారా వెల్లడైందని వీరుపేర్కొన్నారు. దీంతో ఇక సీబీఐ  సుశాంత్ సూసైడ్ కేసు కోణంలో  దీన్ని దర్యాప్తు చేయనుంది. ఆత్మహత్యకు ఆయనను ఎవరైనా ప్రేరేపించారా  అన్న విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయనున్నారు.

సుశాంత్ ది హత్య అనడానికి ప్రాథమిక సాక్ష్యాధికారాలు లభ్యమైతే, ఐపీసీ లోని 302 సెక్షన్ ను కొత్తగా చేర్చి దర్యాప్తు చేస్తామని సీబీఐ ఇదివరకే ప్రకటించింది. ఢిల్లీ ఎయిమ్స్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి చెందిన నలుగురు డాక్టర్ల బృందం 45 రోజులపాటు ఈ కేసును తమ కోణంలో ‘ఇన్వెస్టిగేట్’ చేసింది. ఉరి వేసుకోవడంవల్ల సుశాంత్ మరణించాడన్న ముంబై కూపర్ ఆసుపత్రి నివేదికతో ఈ బృందం ఏకీభవించింది. తాము స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్, హార్డ్ డ్రైవ్స్, డిజిటల్ కెమెరాల లోని సమాచారాన్ని కూడా ఈ నిపుణుల బృందం  అధ్యయనం చేసింది.