AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉల్లి కన్నీరు తగ్గకముందే..వాయించేస్తోన్న వంట నూనె

ఉల్లి, వెల్లుల్లి, కూరగాయల రేట్లు పెరిగి సామాన్యుడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో తెలిసిందే. వాటి నుంచి ఇంకా కోలుకోకముందే మరో బాంబ్ పేలింది. వంట నూనెల ధరలు అనూహ్యంగా పెరగడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. భారీ వర్షాల ప్రభావంతో నూనె గింజల పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఉత్పత్తి పడిపోవడంతో..డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. పామాయిల్ ధరను గమనిస్తే..గత వారం లీటరు రూ. 68 ఉన్నది కాస్తా ఇప్పుడు రూ. 86కు చేరుకుంది. ఇటీవల 2, […]

ఉల్లి కన్నీరు తగ్గకముందే..వాయించేస్తోన్న వంట నూనె
Ram Naramaneni
|

Updated on: Dec 23, 2019 | 12:43 PM

Share

ఉల్లి, వెల్లుల్లి, కూరగాయల రేట్లు పెరిగి సామాన్యుడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో తెలిసిందే. వాటి నుంచి ఇంకా కోలుకోకముందే మరో బాంబ్ పేలింది. వంట నూనెల ధరలు అనూహ్యంగా పెరగడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. భారీ వర్షాల ప్రభావంతో నూనె గింజల పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఉత్పత్తి పడిపోవడంతో..డిమాండ్ అమాంతం పెరిగిపోయింది.

పామాయిల్ ధరను గమనిస్తే..గత వారం లీటరు రూ. 68 ఉన్నది కాస్తా ఇప్పుడు రూ. 86కు చేరుకుంది. ఇటీవల 2, 3 నెలల కాలంలోనే పామాయిల్ ధర రూ. 20 వరకు పెరగడం గమనార్హం. ఆయిల్ ఫెడ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఒక నెల గ్యాప్‌లోనే వంట నూనె ధర రూ. 8 వరకు పెరిగిందని తెలుస్తోంది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ గత వారం విడుదల చేసిన విత్తనాల గణాంకాల ప్రకారం, ఈ ఏడాది నూనెగింజల పంటల విస్తీర్ణం 68.24 లక్షల హెక్టార్లలో ఉంది, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 2.47 లక్షల హెక్టార్లలో తక్కువ. మరోవైపు.. సోయాబీన్ ప్రాసెసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సోపా) అంచనాల ప్రకారం, ఈ సంవత్సరం దేశంలో సోయాబీన్ ఉత్పత్తి 89.94 లక్షల టన్నులు, ఇది గతేడాది 109.33 లక్షల టన్నుల ఉత్పత్తి కంటే 71.73 శాతం తక్కువ. ఇలా స్వదేశంలో ఉత్పత్తి తగ్గిపోవడం..మలేషియా, ఇండోనేషియాల నుంచి దిగుమతుల శుంకాలు భారీగా పెరగడమే ఈ ధరల్లో ఈ అనూహ్య మార్పులకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే