ఆర్థిక ఇబ్బందుల్లో కాంగ్రెస్?

2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీని ఆర్థిక ఇబ్బందులు కూడా చుట్టుముట్టాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత చతికిలబడ్డ కాంగ్రెస్ పార్టీ .. క్రమంగా తన ఉనికిని కోల్పోతుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పార్టీకి చెందిన పలు విభాగాలకు అధిష్ఠానం ఖర్చులు తగ్గించుకోమని తెలియజేసినట్లు సమాచారం. కాంగ్రెస్‌ సేవాదళ్‌ నెలసరి బడ్జెట్‌ను సైతం రూ.2.50లక్షల నుంచి రూ.2లక్షలకు కుదించిందని తెలిపారు. అదేవిధంగా పార్టీ మహిళా, ఎన్‌ఎస్‌యూఐ విభాగాలకు తమ ఖర్చులను తగ్గించుకునే […]

ఆర్థిక ఇబ్బందుల్లో కాంగ్రెస్?
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 13, 2019 | 7:45 PM

2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీని ఆర్థిక ఇబ్బందులు కూడా చుట్టుముట్టాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత చతికిలబడ్డ కాంగ్రెస్ పార్టీ .. క్రమంగా తన ఉనికిని కోల్పోతుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పార్టీకి చెందిన పలు విభాగాలకు అధిష్ఠానం ఖర్చులు తగ్గించుకోమని తెలియజేసినట్లు సమాచారం. కాంగ్రెస్‌ సేవాదళ్‌ నెలసరి బడ్జెట్‌ను సైతం రూ.2.50లక్షల నుంచి రూ.2లక్షలకు కుదించిందని తెలిపారు. అదేవిధంగా పార్టీ మహిళా, ఎన్‌ఎస్‌యూఐ విభాగాలకు తమ ఖర్చులను తగ్గించుకునే మార్గాలు వెతుక్కోమని సూచించిందని వెల్లడించారు.

కాంగ్రెస్‌ కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇప్పటికీ కొద్దినెలలుగా జీతాలు అందడం లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్టీ సామాజిక మాధ్యమ విభాగంలో ఇదువరకు 55 మంది ఉద్యోగులు ఉండగా, 20 మంది రాజీనామాలు చేయడంతో ఇప్పడు కేవలం 35 మంది మాత్రమే మిగిలారు. ఉన్నవారికి కూడా ప్రస్తుతం సరిగా జీతాలు అందడం లేదు. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ విభాగాల ఖర్చు తగ్గించుకోవాలని చూడడం ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంది. అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని ఆర్థిక ఇబ్బందులు కూడా వేధించడం ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది.