స్పెషల్ జెట్ పోయి.. నార్మల్ ప్లేన్ వచ్ఛె.. పాక్ కు ఇమ్రాన్ తిరుగుముఖం !
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శనివారం కమర్షియల్ జెట్ ప్లేన్ లో న్యూయార్క్ నుంచి పాకిస్తాన్ బయలుదేరారు. స్వదేశం వెళ్లేందుకు ఆయనకు సౌదీ ప్రభుత్వం స్పెషల్ విమానం సమకూర్చినప్పటికీ.. న్యూయార్క్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం ఏర్పడడంతో అది తిరిగి అదే ఎయిర్ పోర్టులో అత్యవసరంగా దిగాల్సి వచ్చింది. దీంతో ఉసూరుమంటూ ఇమ్రాన్, ఆయన వెంట ఉన్న ప్రతినిధి బృందం కొన్ని గంటలపాటు ఈ నగరంలోనే ఉండిపోక తప్పలేదు. చివరకు ఓ కమర్షియల్ […]
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శనివారం కమర్షియల్ జెట్ ప్లేన్ లో న్యూయార్క్ నుంచి పాకిస్తాన్ బయలుదేరారు. స్వదేశం వెళ్లేందుకు ఆయనకు సౌదీ ప్రభుత్వం స్పెషల్ విమానం సమకూర్చినప్పటికీ.. న్యూయార్క్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం ఏర్పడడంతో అది తిరిగి అదే ఎయిర్ పోర్టులో అత్యవసరంగా దిగాల్సి వచ్చింది. దీంతో ఉసూరుమంటూ ఇమ్రాన్, ఆయన వెంట ఉన్న ప్రతినిధి బృందం కొన్ని గంటలపాటు ఈ నగరంలోనే ఉండిపోక తప్పలేదు. చివరకు ఓ కమర్షియల్ విమానంలో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఇమ్రాన్ బృందం న్యూయార్క్ నుంచి బయలుదేరి జెడ్డా చేరుకుంది. అక్కడి నుంచి ఆదివారం సాయంత్రానికి ఇస్లామాబాద్ లో ఈ ప్లేన్ దిగనుంది. ఇదిలా ఉండగా.. జమ్మూ కాశ్మీర్లో రక్తపాతం తప్పదంటూ ఇమ్రాన్ ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ‘ హుంకరించిన ‘ నేపథ్యంలో కాశ్మీర్లో ప్రజల రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. ఐరాసలో ఇమ్రాన్ స్పీచ్ ఇలా ముగిసిందో, లేదో.అలా.. శ్రీనగర్ లో శుక్రవారం రాత్రి మెజారిటీ ముస్లిములు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి.. ఇమ్రాన్ కు మద్దతుగా నినాదాలు చేశారు. తమకు స్వతంత్ర కాశ్మీర్ కావాలంటూ గళమెత్తారు. దీంతో ఉద్రిక్తతలు పెరగవచ్చునని భావించిన ప్రభుత్వం మళ్ళీ ఆంక్షలు విధించింది.