ఐపీఎల్‌లో మెరిసిన… ఎవరీ ముద్దుగుమ్మ?

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో తళుక్కుమని మెరిసింది. చిరునవ్వులు చిందిస్తున్న ఆమె టీవీలో అలా ఫ్లాష్ అయ్యిందో లేదో.. ఇలా ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. మ్యాచ్ హోరాహోరీగా సాగుతున్న సమయంలో కూడా కెమేరా మ్యాన్‌ ఆమెనే ఫోకస్ చేశాడంటే.. ఎంతగా ఆకట్టుకుందో అర్థమవుతుంది. ఇందుకు అతడికి తప్పకుండా అవార్డు ఇవ్వాల్సిందే. ఇక ఫైనల్ ముగియగానే.. నెటిజన్స్ ఈ అమ్మాయి కోసం గూగుల్, ఫేస్‌బుక్.. ఇలా అన్నీ వెతికి… ఆమె ఆచూకీ పట్టేసారు. ఆమె పేరు అదితి హుందియా. 2018లో మిస్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:53 pm, Tue, 14 May 19
ఐపీఎల్‌లో మెరిసిన... ఎవరీ ముద్దుగుమ్మ?

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో తళుక్కుమని మెరిసింది. చిరునవ్వులు చిందిస్తున్న ఆమె టీవీలో అలా ఫ్లాష్ అయ్యిందో లేదో.. ఇలా ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. మ్యాచ్ హోరాహోరీగా సాగుతున్న సమయంలో కూడా కెమేరా మ్యాన్‌ ఆమెనే ఫోకస్ చేశాడంటే.. ఎంతగా ఆకట్టుకుందో అర్థమవుతుంది. ఇందుకు అతడికి తప్పకుండా అవార్డు ఇవ్వాల్సిందే.

ఇక ఫైనల్ ముగియగానే.. నెటిజన్స్ ఈ అమ్మాయి కోసం గూగుల్, ఫేస్‌బుక్.. ఇలా అన్నీ వెతికి… ఆమె ఆచూకీ పట్టేసారు. ఆమె పేరు అదితి హుందియా. 2018లో మిస్ దివా సూపర్ నేషనల్ టైటిల్ గెలుపొందింది. పోలాండ్‌లో జరిగిన అందాల పోటీలో ఆమె ఇండియా తరపున పాల్గొంది. అదితి 2017లో ‘ఫెమినా మిస్ ఇండియా’ జాబితాలోనూ స్థానం సాధించింది. కలర్స్ ఫెమినా మిస్ ఇండియా రాజస్థాన్ టైటిల్ కూడా గెలుచుకుంది. అతిథికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎంఎస్ ధోని, విరాట్ కొహ్లీలు ఆమె ఫేవరెట్ క్రికెటర్స్. అదితి హుందియా నెట్టింట్లో ఇలా విపరీతమైన క్రేజ్ సంపాదించింది.

https://www.instagram.com/p/BvMvhjGnPjN/?utm_source=ig_web_copy_link