యూపీలో “అంగడి బొమ్మ”.. చావు బతుకుల మధ్య…

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన ఓ యువతిని ఆమె కన్నతండ్రే అంగడిబొమ్మలా.. ఓ వ్యక్తికి సరుకులా అమ్మేశాడు. పదివేల రూపాయలకు తన రక్తం పంచుకుబిడ్డను ఓ వ్యక్తికి విక్రయించాడు. సదరు వ్యక్తి ఆమెతో బలవంతంగా ఇండ్లలో వెట్టిచాకిరీ చేయించాడు. దీంతో ఆ ఇండ్లలో వాళ్లు అనేకమార్లు ఆమెపై సామూహిక లైంగికదాడి చేశారు. తనకు జరుగుతున్న అన్యాయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో విరక్తిచెందిన ఆ బాధిత మహిళ ఒంటికి నిప్పంటించుకొని […]

యూపీలో అంగడి బొమ్మ.. చావు బతుకుల మధ్య...
Follow us

| Edited By:

Updated on: May 14, 2019 | 1:49 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన ఓ యువతిని ఆమె కన్నతండ్రే అంగడిబొమ్మలా.. ఓ వ్యక్తికి సరుకులా అమ్మేశాడు. పదివేల రూపాయలకు తన రక్తం పంచుకుబిడ్డను ఓ వ్యక్తికి విక్రయించాడు. సదరు వ్యక్తి ఆమెతో బలవంతంగా ఇండ్లలో వెట్టిచాకిరీ చేయించాడు. దీంతో ఆ ఇండ్లలో వాళ్లు అనేకమార్లు ఆమెపై సామూహిక లైంగికదాడి చేశారు. తనకు జరుగుతున్న అన్యాయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో విరక్తిచెందిన ఆ బాధిత మహిళ ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. 80 శాతం కాలిన గాయాలతో ఘజియాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది.

ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ స్పందించింది. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించేందుకు నిరాకరించిన హపూర్ జిల్లా పోలీసుల తీరుపై దర్యాపు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. బాధిత మహిళ పట్ల యూపీ పోలీసుల వ్యవహరించిన తీరు క్షమించలేని విధంగా ఉందని పేర్కొన్నారు. డీసీడబ్ల్యూ జోక్యంతో యూపీ పోలీసులు బాబుగఢ్ సర్పంచ్‌తోపాటు మరో 13 మందిపై లైంగికదాడి కేసు నమోదుచేశారు. కానీ, ఎవరినీ కూడా ఇంత వరకు అరెస్ట్ చేయలేదు. మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు హపూర్ ఎస్పీ తెలిపారు. తన ఫిర్యాదును పోలీసులు తీసుకోవడానికి నిరాకరించినందునే బాధిత మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందనే అంశాన్ని తిరస్కరించారు.