గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన హీరోయిన్ శృతి హాస‌న్‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవి శ్రీ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీక‌రించింది ప్ర‌ముఖ హీరోయిన్ శృతి హాస‌న్‌. ఈ రోజు శృతి త‌మిళ‌నాడులోని త‌న నివాసంలో మూడు మొక్క‌లు నాటింది. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన‌డం..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన హీరోయిన్ శృతి హాస‌న్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 12, 2020 | 9:00 PM

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఆయన పిలుపు మేరకు పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి మొక్కలు నాటడమే కాకుండా బాధ్యత తీసుకోని ఇతరుల చేత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పూర్తి చేయించడం జరుగుతుంది. ఇటీవ‌లే మ‌హేష్ బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ఆయ‌న తార‌క్‌, విజ‌య్‌, శృతి హాస‌న్‌ని నామినేట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవి శ్రీ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీక‌రించింది ప్ర‌ముఖ హీరోయిన్ శృతి హాస‌న్‌. ఈ రోజు శృతి త‌మిళ‌నాడులోని త‌న నివాసంలో మూడు మొక్క‌లు నాటింది. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌ని పేర్కొంది. త‌న‌ను నామినేట్ చేసినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. అనంత‌రం శృతి హాస‌న్ బాలీవుడ్ సూప‌ర్ స్టార్ హృతిక్ రోష‌న్, హీరోయిన్ త‌మ‌న్నా, టాలీవుడ్ హీరో రానాకు గ్రీన్ ఛాలెంజ్ విసిరింది.

Read More:

ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వ హెచ్చ‌రిక‌

ప‌నికి రావ‌డం లేద‌ని 12 ఏళ్ల బాలుడిని చావ‌గొట్టిన య‌జ‌మాని

క‌రోనా నుంచి కోలుకున్న డైరెక్ట‌ర్‌ రాజ‌మౌళి కుటుంబం