AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నటి సనాఖాన్ షాకింగ్ నిర్ణయం.!

బాలీవుడ్ హీరోయిన్ స‌నా ఖాన్ ఆశ్చర్యకర నిర్ణయం ప్రకటించింది. సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగభరిత, ఆధ్యాత్మిక వ్యాఖ్యలతోకూడిన లేఖ‌ను పోస్ట్ చేసింది. తన జీవితంలో అత్యంత కీల‌క‌మైన విష‌యం గురించి చెబుతున్నానని.. కొన్నేళ్లుగా తాను సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్నానని, అభిమానుల ఆశీర్వాదాల‌తో ఇక్కడ పేరు, డ‌బ్బు, గౌరవం సంపాదించుకున్నానని చెప్పుకొచ్చింది. అయితే, ఓ మ‌నిషి ఈ ప్ర‌పంచంలోకి అడుగు పెట్టేది కేవ‌లం డ‌బ్బు, పేరు కోసమేనా? అంటూ తనలో ఆలోచన మొదలైందని తెలిపింది. […]

నటి సనాఖాన్ షాకింగ్ నిర్ణయం.!
Venkata Narayana
|

Updated on: Oct 09, 2020 | 8:49 PM

Share

బాలీవుడ్ హీరోయిన్ స‌నా ఖాన్ ఆశ్చర్యకర నిర్ణయం ప్రకటించింది. సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగభరిత, ఆధ్యాత్మిక వ్యాఖ్యలతోకూడిన లేఖ‌ను పోస్ట్ చేసింది. తన జీవితంలో అత్యంత కీల‌క‌మైన విష‌యం గురించి చెబుతున్నానని.. కొన్నేళ్లుగా తాను సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్నానని, అభిమానుల ఆశీర్వాదాల‌తో ఇక్కడ పేరు, డ‌బ్బు, గౌరవం సంపాదించుకున్నానని చెప్పుకొచ్చింది. అయితే, ఓ మ‌నిషి ఈ ప్ర‌పంచంలోకి అడుగు పెట్టేది కేవ‌లం డ‌బ్బు, పేరు కోసమేనా? అంటూ తనలో ఆలోచన మొదలైందని తెలిపింది. సహాయం అవసరమైన వారికి సేవ చేయ‌డం అవ‌స‌రం కాదా? అనిపించిందని వెల్లడించింది. ఒక‌వేళ మ‌నిషి ఏ క్ష‌ణంలోనైనా మ‌ర‌ణిస్తే అనంతరం ఏం జ‌రుగుతుందని ఆమె ప్రశ్నించింది.

తాను చాలా కాలంగా ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు వెతుకుతున్నానని, తాను చ‌నిపోయాక ఏం జ‌రుగుతుంద‌‌నేది తెలుసుకోవాల‌నుందని పేర్కొంది. దీనికి తన మ‌తంలోనే స‌మాధానం ల‌భించిందని తెలిపింది. చనిపోయాక మంచి జీవితం పొంద‌డం కోస‌మే ఈ జీవితమని.. ప్రస్తుత జీవితంలో నిస్స‌హాయుల‌కు సేవ చేయాలన్నదే దేవుడి ఆజ్ఞ అని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే తాను సినీ జీవితానికి శాశ్వ‌తంగా గుడ్‌బై చెబుతున్నానని చెప్పింది. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన సనా తెలుగులో ‘క‌త్తి’, ‘మిస్ట‌ర్ నూక‌య్య’ వంటి సినిమాల్లో న‌టించింది.

Follow Us
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా