AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరోతో రొమాన్స్.. చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను!

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న కాజల్ అగర్వాల్.. రీసెంట్‌గా మంచు లక్ష్మీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ రియాలిటీ షో సంచలన నిజాలు బయటపెట్టారు. బాలీవుడ్ నటుడు రణదీప్ హుడాతో కలిసి రొమాంటిక్ సన్నివేశాలు నటించేటప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చింది. 2016లో హిందీ సినిమా ‘దో లఫ్జోన్‌ కే కహానీ’లో రణదీప్ హుడాకు జంటగా కాజల్ నటించింది. అప్పట్లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఇప్పటివరకు మీరు నటించిన సినిమాల్లో ఏ […]

ఆ హీరోతో రొమాన్స్.. చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను!
Ravi Kiran
|

Updated on: Oct 26, 2019 | 8:39 PM

Share

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న కాజల్ అగర్వాల్.. రీసెంట్‌గా మంచు లక్ష్మీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ రియాలిటీ షో సంచలన నిజాలు బయటపెట్టారు. బాలీవుడ్ నటుడు రణదీప్ హుడాతో కలిసి రొమాంటిక్ సన్నివేశాలు నటించేటప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చింది. 2016లో హిందీ సినిమా ‘దో లఫ్జోన్‌ కే కహానీ’లో రణదీప్ హుడాకు జంటగా కాజల్ నటించింది. అప్పట్లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.

ఇప్పటివరకు మీరు నటించిన సినిమాల్లో ఏ హీరోతో రొమాన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డారని మంచు లక్ష్మీ అడగ్గా.. ‘మామూలుగా ప్రేమించిన వ్యక్తి కళ్లలోకి చూసి మనం ప్రేమను తెలియపరుస్తాం. కానీ, దో లఫ్జోన్‌ కే కహనీ చిత్రంలో నేను అంధురాలి పాత్రను పోషించాను. మా ఇద్దరి మధ్య ప్రేమను చూపించడానికి కొన్ని రొమాంటిక్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో చాలా ఇబ్బందిపడ్డాను. నాకు తెలియని ఒక వ్యక్తితో అలాంటి సన్నివేశాల్లో నటించడం చాలా ఇబ్బందిగా అనిపించింది.’ అని కాజల్‌ పేర్కొన్నారు.

ప్రస్తుతం కాజల్ ‘ముంబయి సాగా’, ‘భారతీయుడు 2’ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ కథానాయకుడిగా దర్శకుడు శంకర్ ‘భారతీయుడు 2’ను తెరకెక్కిస్తున్నాడు.

Follow Us
మీరు గంటల తరబడి కూర్చొని పనిచేస్తున్నారా..? ఇది తప్పక తెలుసుకోండి
మీరు గంటల తరబడి కూర్చొని పనిచేస్తున్నారా..? ఇది తప్పక తెలుసుకోండి
భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య కీలక ఒప్పందాలు.. పూర్తి వివరాలు ఇవే!
భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య కీలక ఒప్పందాలు.. పూర్తి వివరాలు ఇవే!
కోరుకున్న ప్రేయసివే.. దూరమైన ఊర్వశివే.. ఈ లిరిక్స్ ఏ పాటలో గుర్తు
కోరుకున్న ప్రేయసివే.. దూరమైన ఊర్వశివే.. ఈ లిరిక్స్ ఏ పాటలో గుర్తు
షాపింగ్ మాల్స్‌లో బిల్లింగ్‌కు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలా
షాపింగ్ మాల్స్‌లో బిల్లింగ్‌కు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలా
ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్‌ఫోన్‌ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు
ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్‌ఫోన్‌ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు
ముస్లిం సోదరుల కోసం హిందూ కుటుంబం ఉదారత
ముస్లిం సోదరుల కోసం హిందూ కుటుంబం ఉదారత
పిల్లలకు ఎక్కువగా సాల్ట్, స్వీట్ తినిపిస్తున్నారా..? ఇది తెలిస్తే
పిల్లలకు ఎక్కువగా సాల్ట్, స్వీట్ తినిపిస్తున్నారా..? ఇది తెలిస్తే
దారుణం.. 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి..
దారుణం.. 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి..
బంగారం Vs బ్యాంక్ FD: సామాన్యులకు ఏది బెస్ట్.? డబ్బు డబుల్ చేసే..
బంగారం Vs బ్యాంక్ FD: సామాన్యులకు ఏది బెస్ట్.? డబ్బు డబుల్ చేసే..
రోజూ ఆపిల్ ఇలా వాడండి .. చర్మం ముత్యంలా మెరిసిపోతుంది!
రోజూ ఆపిల్ ఇలా వాడండి .. చర్మం ముత్యంలా మెరిసిపోతుంది!