ఆర్టికల్ 370 రద్దు చారిత్రాత్మక నిర్ణయం: ఆర్మీ చీఫ్

| Edited By:

Jan 15, 2020 | 7:15 PM

ఆర్టికల్ 370 ను రద్దు చేయడం జమ్మూకశ్మీర్ ను ఇతర ప్రాంతాలతో అనుసంధానించడానికి సహాయపడే చారిత్రాత్మక దశ అని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే అన్నారు. ఢిల్లీలో జరిగిన 72వ ఆర్మీ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ.. “ఆర్టికల్ 370 ను తొలగించడం ఒక చారిత్రాత్మక దశ.. ఇది జమ్మూ కాశ్మీర్‌ను ఇతర ప్రాంతాలతో అనుసంధానించడానికి సహాయపడుతుంది. దీని ద్వారా మనతో […]

ఆర్టికల్ 370 రద్దు చారిత్రాత్మక నిర్ణయం: ఆర్మీ చీఫ్
Follow us on

ఆర్టికల్ 370 ను రద్దు చేయడం జమ్మూకశ్మీర్ ను ఇతర ప్రాంతాలతో అనుసంధానించడానికి సహాయపడే చారిత్రాత్మక దశ అని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే అన్నారు. ఢిల్లీలో జరిగిన 72వ ఆర్మీ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ.. “ఆర్టికల్ 370 ను తొలగించడం ఒక చారిత్రాత్మక దశ.. ఇది జమ్మూ కాశ్మీర్‌ను ఇతర ప్రాంతాలతో అనుసంధానించడానికి సహాయపడుతుంది. దీని ద్వారా మనతో పరోక్ష యుద్ధం చేస్తున్న పొరుగు దేశం పాకిస్థాన్‌ భంగపాటుకు గురైంది. ఆర్మీని భవిష్యత్తు యుద్ధాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంపై దృష్టి సారిస్తున్నాం” అని అన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన జవాన్లకు పతకాలు బహూకరించారు.

ఆర్టికల్ 370 నిర్ణయం జమ్మూ కాశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితిని మెరుగుపరిచిందని గతంలో ఆయన చెప్పారు. “జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 ను రద్దు చేసిన తరువాత హింసాత్మక సంఘటనలు తగ్గాయన్నారు. శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడిందని నరవాణే తెలిపారు. గత నెలలో జనరల్ బిపిన్ రావత్ నుంచి బాధ్యతలు స్వీకరించిన ఆర్మీ చీఫ్, పాకిస్థాన్‌పై కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. ఆర్టికల్ 370ని రద్దుచేసి జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక హోదాను ప్రభుత్వం ఆగస్టులో తొలగించింది. రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.