విరాట్ కోహ్లీ ‘సింహం’ లాంటోడుః శ్రేయాస్ అయ్యర్
టీమిండియా యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తాడు. 'ప్రతీ మ్యాచ్‌ను తన మొదటి మ్యాచ్‌లానే కోహ్లీ ఫీల్ అవుతాడని అయ్యర్ తెలిపాడు.

టీమిండియా యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తాడు. ‘ప్రతీ మ్యాచ్‌ను తన మొదటి మ్యాచ్‌లానే కోహ్లీ ఫీల్ అవుతాడని అయ్యర్ తెలిపాడు. విజయం కోసం ఎప్పుడూ పరితపిస్తుంటాడు. ఆ కసి తన కళ్లలో కనిపిస్తుందన్నాడు. యువ క్రికెటర్లు అందరూ కూడా కోహ్లీని చూసి ఎంతో నేర్చుకోవాలని అయ్యర్ పేర్కొన్నాడు.
‘విరాట్ కోహ్లీ అభినందించిన ప్రతీసారి అదొక గొప్ప అనుభూతిలా ఫీల్ అవుతాను. ఆటను నిజంగా నాయకుడు, రోల్ మోడల్. జట్టులో కోహ్లీ సింహం లాంటివాడు. అతని పరుగుల దాహం ఎప్పటీకి తీరదు. ప్రతీసారి మొదటి మ్యాచ్ అడుతున్నట్లే ఫీలవుతాడు. మైదానంలో ఎప్పుడూ అలిసిపోడు. సింహంలా బలంగా ఉంటాడు. అతని నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వీడియో చాట్‌లో శ్రేయాస్ అయ్యర్ పేర్కొన్నాడు.
ఇక జట్టులోని నాలుగోస్థానం గురించి కూడా మాట్లాడిన అయ్యర్.. ఫోర్త్ డౌన్ తనదేనని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న తాను ఆ స్థానాన్ని సొంతం చేసుకోవడం అద్భుతంగా ఉందన్నాడు. అయితే పరిస్థితులకు అనుగుణంగా ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్దంగా ఉండాలని శ్రేయాస్ అయ్యర్ వెల్లడించాడు.
Also Read:
జగన్ కీలక నిర్ణయం.. వారందరికీ ఇసుక ఉచితం..
అంతర్రాష్ట్ర సర్వీసులపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..
విజయవాడలో కరోనా టెర్రర్.. కంటైన్మెంట్ జోన్లుగా 42 డివిజన్లు..
జగన్ కీలక నిర్ణయం.. త్వరలోనే వైద్యశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.!




