వాటే ఐడియా సర్ జీ.. మాస్క్ లేని ఆ వ్యక్తి చేసిన పనికి పోలీసుల ఫ్యూజులు ఎగిరిపోయాయి.. వైరల్ వీడియో..

గత సంవత్సర కాలంగా యావత్ ప్రపంచాన్ని కరోనా మాహమ్మరి వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ ఆయా దేశాల్లో మరణమృదంగం మోగించి.. ఎన్నో మంది జీవితాల్లో చీకట్లను మిగిల్చింది.

వాటే ఐడియా సర్ జీ.. మాస్క్ లేని ఆ వ్యక్తి చేసిన పనికి పోలీసుల ఫ్యూజులు  ఎగిరిపోయాయి.. వైరల్ వీడియో..
Viral Video

గత సంవత్సర కాలంగా యావత్ ప్రపంచాన్ని కరోనా మాహమ్మరి వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ ఆయా దేశాల్లో మరణమృదంగం మోగించి.. ఎన్నో మంది జీవితాల్లో చీకట్లను మిగిల్చింది. ఇక ఈ మహామ్మరి మిగిల్చిన విషాదం నుంచి గత కొన్ని రోజులుగా ఈ వైరస్ ప్రభావం తగ్గిందనుకుంటున్న క్రమంలో మళ్లీ కొన్ని రోజులుగా కేసులు సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు కరోనా నిబంధనలను కచ్చితం చేస్తున్నాయి. ఇక ఇదే సమయంలో కొన్ని రాష్ట్రాలు తాత్కలిక లాక్ డౌన్ విధానాన్ని అవలంభిస్తున్నాయి. ఇప్పటికే స్కూల్స్, కాలేజీలను మళ్లీ మూసివేయగా.. పరీక్షలను కూడా వాయిదా వేసే యోచనలో ప్రభుత్వాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కరోనా నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు మాస్క్ కచ్చితంగా ధరించాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్న కొందరు మాత్రం వినిపించుకోవడం లేదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లేముందు మాస్కులు కచ్చితంగా ధరించాలని సూచిస్తున్న చాలా వరకు పట్టించుకోకుండా.. మాస్క్ లేకుండానే తిరిగేస్తున్నారు.

తాజాగా ఓ మాస్క్ ధరించిన వ్యక్తి చేసిన పనికి అక్కడున్న వారితోపాటు పోలీసులు కూడా ఒకింత షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో రోడ్డుపై ఓ కూరగాయల బండి దగ్గర నిల్చున్న వ్యక్తి మాస్క్ ధరించలేదు. అటుగా వస్తున్న పోలీస్ మాస్క్ ధరించాలని అందిరిని హెచ్చిరిస్తూ వస్తున్నాడు. ఇది గమనించిన ఆ వ్యక్తి వెంటనే ఆ బండిపై ఉన్న పాలిథిన్ కవర్‏ను మాస్క్ మాదిరిగా చేసి తన ముఖానికి ధరించాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన పోలీస్ అతన్ని అక్కడే వీడియో తీస్తున్న వ్యక్తి వైపు చూపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దానిని కొందరు మీమ్స్ చేసి వదిలారు. మరీ ఆ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి.

వీడియో..

 

View this post on Instagram

 

A post shared by Confused Aatma (@confused.aatma)

Also Read:  ‘పుష్ప’ కోసం రంగంలోకి ఆస్కార్ విజేత.. ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‏పీరియన్స్‏ను అందించనున్న సుకుమార్..