కేసీఆర్ నా వల్లే సీఎం అయ్యాడు..! చంద్రబాబుపై కేసు పెడతా..!

గుంటూరు గోరంట్లలోని శ్రీపద్మావతి అండాళ్‌ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి రిలీజియన్‌ సొసైటీ దేవస్థానంలో జరుగుతున్న సప్తదశ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలయాల భూములు అన్యాక్రాంతం అయ్యాయని ఫైర్ అయ్యారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి. వీటికి సంబంధించిన ప్రతీ ఆధారం తన వద్ద ఉందని త్వరలోనే వీటిని మీడియా ముందు పెడతానన్నారు. వీటిపై కోర్టుకు వెళ్లడానికి కూడా నేను వెనకాడనని అన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబుపై కూడా […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:47 am, Mon, 18 February 19
కేసీఆర్ నా వల్లే సీఎం అయ్యాడు..! చంద్రబాబుపై కేసు పెడతా..!

గుంటూరు గోరంట్లలోని శ్రీపద్మావతి అండాళ్‌ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి రిలీజియన్‌ సొసైటీ దేవస్థానంలో జరుగుతున్న సప్తదశ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలయాల భూములు అన్యాక్రాంతం అయ్యాయని ఫైర్ అయ్యారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి. వీటికి సంబంధించిన ప్రతీ ఆధారం తన వద్ద ఉందని త్వరలోనే వీటిని మీడియా ముందు పెడతానన్నారు. వీటిపై కోర్టుకు వెళ్లడానికి కూడా నేను వెనకాడనని అన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబుపై కూడా కేసు పెడతానని అన్నారు స్వరూపానందేంద్ర స్వామి. అలాగే.. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా పాలన అస్థవ్యస్థంగా ఉందని ధ్వజమెత్తారు. కేసీఆర్ సీఎం కావడానికి నేను చేసిన రాజశ్యామల యాగ ఫలమేనన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి తారా స్థాయిలో చేరిందని, దానికి అడ్డుకట్ట వేయాలంటే త్వరలోనే ఏపీలో కూడా రాజశ్యామల యాగం చేస్తానని తెలిపారు.