AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశ రాజధానిలో రెచ్చిపోయిన కారు డ్రైవర్.. బ్యానెట్‌పై ఉన్నా ఆగకుండా..

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఘజియాబాద్‌లో ఓ కారు డ్రైవర్‌ బీభత్సం సృష్టించాడు. కారు బ్యానెట్‌పై వ్యక్తి ఉండగా… రెండు కిలోమీటర్ల దూరం డ్రైవ్‌ చేశాడు. ఘజియాబాద్‌కు చెందిన ఓ యువ‌కుడు త‌న కారుతో మ‌రో క్యాబ్‌ను ఢీకొట్టాడు. దాంతో ఆ క్యాబ్ డ్రైవ‌ర్ ఆ యువ‌కుడిని ప్రశ్నించేందుకు కారుకు ఎదురుగా నిల‌బడి ఆపే ప్రయత్నం చేశాడు. కారును ఆపేందుకు నిరాక‌రించిన ఆ యువ‌కుడు .. అలాగే ముందుకు డ్రైవ్‌ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో […]

దేశ రాజధానిలో రెచ్చిపోయిన కారు డ్రైవర్..  బ్యానెట్‌పై ఉన్నా ఆగకుండా..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 4:58 PM

Share

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఘజియాబాద్‌లో ఓ కారు డ్రైవర్‌ బీభత్సం సృష్టించాడు. కారు బ్యానెట్‌పై వ్యక్తి ఉండగా… రెండు కిలోమీటర్ల దూరం డ్రైవ్‌ చేశాడు. ఘజియాబాద్‌కు చెందిన ఓ యువ‌కుడు త‌న కారుతో మ‌రో క్యాబ్‌ను ఢీకొట్టాడు. దాంతో ఆ క్యాబ్ డ్రైవ‌ర్ ఆ యువ‌కుడిని ప్రశ్నించేందుకు కారుకు ఎదురుగా నిల‌బడి ఆపే ప్రయత్నం చేశాడు. కారును ఆపేందుకు నిరాక‌రించిన ఆ యువ‌కుడు .. అలాగే ముందుకు డ్రైవ్‌ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో క్యాబ్‌ డ్రైవర్‌ కారు బ్యానెట్‌పైకి ఎక్కాడు. అయినప్పుటికీ ఆ యువకుడు కారును ఆపకుండా రెండు కిలోమీటర్ల మేర డ్రైవ్‌ చేశాడు. కానీ క్యాబ్ డ్రైవ‌ర్ మాత్రం త‌న కారును బ్యానెట్‌ను పట్టుకుని వ‌ద‌ల్లేదు. ఈ ఘటనను అంతా అదే రోడ్డుపై వెళ్లున్న కొందరు వీడియో తీశారు. కారు బ్యానెట్‌పై ఉన్న యువకుడు కూడా కారు డ్రైవ‌ర్‌ను నిల‌దీస్తూ ఆ వీడియోలో క‌నిపించాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు ఛాకచక్యంగా వ్యవహరించి కారును నిలిపివేయించారు. అనంతరం ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బ్యానెట్‌పై ఉన్నా.. ధైర్యం ప్రదర్శించిన క్యాబ్‌ డ్రైవర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.