80శాతం మంది స్వచ్ఛందంగా కోలుకుంటున్నారు..!
ప్రస్తుతం కోవిద్ 19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ సోకిన వాళ్లలో 80శాతం మంది ఎలాంటి చికిత్స అవసరం లేకుండానే స్వచ్ఛందంగా కోలుకుంటున్నారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్) డైరెక్టర్

ప్రస్తుతం కోవిద్ 19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ సోకిన వాళ్లలో 80శాతం మంది ఎలాంటి చికిత్స అవసరం లేకుండానే స్వచ్ఛందంగా కోలుకుంటున్నారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ ప్రకటించారు. జలుబు, దగ్గు వంటి లక్షణాలున్న వారిలోనూ 20శాతం మందికి మాత్రమే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం వస్తోందని అన్నారు. ఆసుపత్రిలో చేరిన వారిలో 5శాతం బాధితులకు మాత్రమే కొత్తరకం మెడిసిన్ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ 15వేల నుంచి 17వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు చెప్పారు.
కాగా.. ఒకే రోజు 10వేల మందికి పరీక్షలు చేసే సామర్థ్యం మనకు ఉందన్నారు. అంటే వారానికి 50వేల నుంచి 70వేల పరీక్షలు చేసేందుకు వీలుందని పేర్కొన్నారు. గొలుసుకట్టు వ్యవస్థలాంటి లక్షణాలున్న కరోనా వైరస్‌ను అడ్డుకోవాలంటే స్వీయ నిర్బంధమే కీలకమని చెప్పారు. గాలిలో ఈ వైరస్ బతకలేదని, వైరస్ సోకిన వారి తుంపర్ల ద్వారా ఇతరులకు సంక్రమిస్తుందని తెలిపారు. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో పాల్గొని ప్రజలు బాగా సహకరించారని ఆయన పేర్కొన్నారు.